Kakinada: 14 రోజుల క్రితం యువతి మిస్సింగ్.. సూసైడ్ నోట్ లభ్యం.. తాజాగా ఊహించని ట్విస్ట్

ఆగస్టు 13న యువతి అదృశ్యం అయ్యింది. ఇంట్లో ఆమె రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. యానం వద్ద గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రాసి ఉంది. కానీ...

Kakinada: 14 రోజుల క్రితం యువతి మిస్సింగ్.. సూసైడ్ నోట్ లభ్యం.. తాజాగా ఊహించని ట్విస్ట్
Kakinada Police
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 27, 2022 | 3:42 PM

Andhra Pradesh: ఓ యువతి మిస్సింగ్ కేసు కాకినాడ జిల్లా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది. ఎట్టకేలకు మిస్టరీని చేదించారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే..  తాళ్ళరేవు మండలం(Thallarevu Mandal) నీలపల్లి(Neelapalle) గ్రామానికి చెందిన యువతి మంతా సాయి శ్రీజ ఆగస్టు 13న అదృశ్యం అయ్యింది. ఇంట్లో ఆమె రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. యానం వద్ద గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రాసి ఉంది. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే అలర్టైన కాప్స్ మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని.. గోదావరిలో రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ యువతి ఆచూకీ లభ్యం కాలేదు. ఒకవేళ సూసైడ్ చేసుకుంది అనుకున్నా.. డెడ్‌బాడీ కూడా కనిపించలేదు. ఎలాంటి క్లూస్ లభ్యం కాకపోవడంతో పోలీసులకు.. ఈ కేసు పెద్ద టాస్క్‌గా మారింది. ఎట్టకేలకు 14 రోజుల తర్వాత యువతి మిస్సింగ్ మిస్టరీని సాల్వ్ చేశారు పోలీసులు. సెల్‌ఫోన్ IMEI నంబర్ ఆధారంగా ఆమె ఆచూకి కనుగొన్నారు. అదృశ్యం అయిన రోజు యువతి తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ వెళ్లింది. పోలీసులు వెతుకుతున్నట్లు తెలుసుకుని ఇద్దరి స్నేహితుల దగ్గరికి వెళ్లి… అక్కడనుండి కాకినాడ చేరుకుని తలదాచుకుంది.  ఆమె IMEI ట్రేస్ చేయగా తాజాగా లోకేషన్ కాకినాడలో ఉన్నట్లు తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్లి సాయు శ్రీజను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వెంకీ, సాయి అనే ఇద్దరు యువకులు వేదించడం వల్లే ఇలా చేసినట్లు ఆ యువతి చెబుతుంది.  వాళ్లను కఠినంగా శిక్షించాలని పోలీసులని కోరింది. సాయి శ్రీజ ఆచూకీ లభ్యం కావడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి