Andhra Pradesh: ఆరోగ్య కేంద్రంలో తాచు పాము హల్ చల్.. భయంతో పరుగులు తీసిన పేషెంట్స్

ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో సాధారణంగా రోగులు, వారి బంధువులు ఉంటారు. కానీ ఆ పీహెచ్సీ లో మాత్రం పెద్ద తాచుపాము తిష్ట వేసింది. ఆస్పత్రి ఆవరణలో చెట్లు, పెదలు పెరిగిపోవడంతో అందులోనే...

Andhra Pradesh: ఆరోగ్య కేంద్రంలో తాచు పాము హల్ చల్.. భయంతో పరుగులు తీసిన పేషెంట్స్
Snake In Phc
Follow us

|

Updated on: Aug 27, 2022 | 3:26 PM

ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో సాధారణంగా రోగులు, వారి బంధువులు ఉంటారు. కానీ ఆ పీహెచ్సీ లో మాత్రం పెద్ద తాచుపాము తిష్ట వేసింది. ఆస్పత్రి ఆవరణలో చెట్లు, పెదలు పెరిగిపోవడంతో అందులోనే నివాసముంటోంది. అయితే.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అది పొదల నుంచి బయటకు వచ్చింది. అది కాస్తా పేషెంట్స్ కంటపడింది. వెంటనే అప్రమత్తమైన వారు సిబ్బందికి సమాచారం అందించారు.

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాచు పాము హల్ చల్ చేసింది. పీహెచ్సీ ప్రాంగణంలోని ఓ గుంతలో దాగున్న పామును ఆస్పత్రి సిబ్బంది, పేషెంట్స్ గుర్తించారు. వెంటనే భయంతో పరుగులు తీశారు. పాము ఉందన్న విషయాన్ని అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా కొద్దిసేపటి తర్వాత పాము పీహెచ్సీ పక్కనే ఉన్న ముళ్ళపొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో వైద్య సిబ్బంది, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి