AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JP Nadda: హైదరాబాద్ చేరుకున్న బీజేపీ చీఫ్ నడ్డా.. నోవాటెల్‌లో బీజేపీ నేతలతో భేటీ.. మరికాసేపట్లో వరంగల్‌కు..

వరంగల్ సభకు హాజరయ్యేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు క్యూ కట్టారు.

JP Nadda: హైదరాబాద్ చేరుకున్న బీజేపీ చీఫ్ నడ్డా.. నోవాటెల్‌లో బీజేపీ నేతలతో భేటీ.. మరికాసేపట్లో వరంగల్‌కు..
Jp Nadda
Shaik Madar Saheb
|

Updated on: Aug 27, 2022 | 1:38 PM

Share

Telangana BJP: తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో హన్మకొండ వేదికగా మరికొన్ని గంటల్లో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు హాజరయ్యేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు క్యూ కట్టారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని నడ్డాకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నడ్డా శంషాబాద్‌ నుంచి నేరుగా నోవాటెల్‌ హోటల్‌కి వెళ్లనున్నారు. దాదాపు గంట సేపు అక్కడే ఉండనున్నారు. బీజేపీ నేతలతో పాటు క్రికెటర్‌ మిథాలీరాజ్‌తో భేటీ కానున్నారు. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్‌ బయలుదేరుతారు నడ్డా. ముందుగా భద్రకాళి టెంపుల్‌లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. వరంగల్ ఆర్ట్స్‌ కాలేజీలో సభకు హాజరయ్యే ముందు కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్‌ వెంకట రమణ నివాసానికి వెళ్లనున్నారు. తెలంగాణ రాకముందు వచ్చాక పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశాలపై ఆరాతీయనున్నారు.

సాయంత్రం 4.10 గం.లకు నడ్డా ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌కి చేరుకోనున్నారు. సభా వేదికగా ఆయన బీజేపీ శ్రేణులకి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? ఎవరెవర్ని పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు? టీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా ఎలాంటి యాక్షన్ ప్లాన్ ప్రకటించబోతున్నారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

బీజేపీ నేతల ఫ్లెక్సీలతో వరంగల్‌, కాజీపేట, హన్మకొండ పట్టణాలు కాషాయంగా మారిపోయాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలతో బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర నడుమ బొల్లికుంట నుంచి ప్రారంభమైంది. అక్కడినుంచి భద్రకాళి ఆలయం వైపు పాదయాత్ర కొనసాగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..