Horoscope Today: ఈ రాశి వ్యాపారస్తులు లాభాలను ఆర్జించే అవకాశం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆగష్టు 29వ తేదీ ) సోమవారం రాశి ఫలాలు (Rashi Phalalu) గురించి తెలుసుకుందాం..
Horoscope Today (29-08-2022): మనిషి జీవితం ప్రతి రోజు సరికొత్తగా మొదలవుతుంది. దీంతో రోజులో ఏ పనులు మొదలు పెట్టాలన్నా తమకు ఈరోజు ఎలా ఉంటుంది అంటూ మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. ఈ రోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆగష్టు 29వ తేదీ ) సోమవారం రాశి ఫలాలు (Rashi Phalalu) గురించి తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశివారు ఈరోజు మిత్రులతో అభిప్రాయబేధాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా చేయాల్సి ఉంటుంది. కష్టాన్ని నమ్ముకుని ఆలోచించి నిర్ణయంతీసుకోండి. భవిష్యత్ కోసం తగిన ప్రణాళికలతో ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు అవసరాలకు తగిన సాయం అందుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు అవసరానికి అనుగుణంగా మెలగాల్సి ఉంటుంది. చేపట్టిన పనుల్లో అధిక శ్రమ పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారికి పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు సత్పలితాలను పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహారించాల్సి ఉంటుంది.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల్లో ఆనందం నెలకొంటుంది. కీలక వ్యవహారంలో ఆర్ధిక సాయం అందుతుంది. ఇతరుల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో విందు, వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆనందంగా గడుపుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి.చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురుకాకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది. నలుగురికి ఉపయోగపడే పనులను చేసి తోటి వారి ప్రశంసలు పొందుతారు.
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు కీలక సమయంలో మంచి నిర్ణయం తీసుకుంటారు. అనవసర విషయాలతో సమయాన్నివృధా చేయవద్దు. కుటుంబ సభ్యులకు శుభకాలం. అనవసర విషయాలపై దృష్టి పెట్టి.. సమయాన్ని వృధా చేయకండి.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రయాణ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఆశించిన ఫలితాలను పొందడానికి అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడం మేలు.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు వ్యాపారంలో స్థిరమైన లాభాలను అందుకుంటారు. ఆనందంగా గడుపుతారు. ఆర్ధికంగా శుభకాలం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు విజయాన్ని సొంతం చేసుకుంటారు.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు అభివృద్ధికి సంబంధించి నిర్ణయాలను స్థిర చిత్తంతో తీసుకోవాలి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇతరుల సహకారాన్ని తీసుకోవాలి.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారికి అనుకూల సమయం. వ్యాపారం లాభాల దిశగా సాగుతుంది. మిత్రులతో కలిసి సంతోషముగా గడుపుతారు. మీ సేవలకు నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)