Telangana: లేడీ ఎస్సై ఓవరాక్షన్‌.. లాఠీతో విచక్షణారహితంగా కొట్టి.. బాధితుడి వేలు విరగ్గొట్టి..

ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే (Police) వారికి రక్షణ లేకుండా చేస్తున్నారు. సమస్య పరిష్కరించాలని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్న వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. వెంటనే చర్యలు ప్రారంభించకుండా నోటికొచ్చినట్లు...

Telangana: లేడీ ఎస్సై ఓవరాక్షన్‌.. లాఠీతో విచక్షణారహితంగా కొట్టి.. బాధితుడి వేలు విరగ్గొట్టి..
Ashwaraopet
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 29, 2022 | 8:55 AM

ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే (Police) వారికి రక్షణ లేకుండా చేస్తున్నారు. సమస్య పరిష్కరించాలని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్న వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. వెంటనే చర్యలు ప్రారంభించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఓ వైపు సమస్యలు, మరో వైపు పోలీసుల మాటలతో బాధితులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాలో ఓ లేడి ఎస్సై ఓవరాక్షన్ ఇన్సిడెంట్ ను మరిచిపోకముందే ఇది జరగడం గమనార్హం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట (Ashwaraopet) లేడీ ఎస్సై చల్లా అరుణ దౌర్జన్యానికి పాల్పడింది. భూ వివాదంలో ఓ యువకుడిని స్టేషన్‌కు పిలిచి, ఇష్టమొచ్చినట్లు చితకబాదింది. బాధితుడి బొటనవేలు విరిగిపోయేలా లాఠీతో తీవ్రంగా కొట్టింది. తన తప్పు లేకున్నా స్టేషన్ కు తీసుకువచ్చి, అమానుషంగా ప్రవర్తించారని బాధితుడు వాపోయాడు. ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. భూ వివాదంలో కలగజేసుకోవడమే కాకుండా స్టేషన్‌కు పిలిచి నోటికొచ్చినట్లు తిడుతూ, విచక్షణారహితంగా కొట్టిందంటూ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు.

కాగా.. చేతిలో లాఠీ ఉంది, పైగా అధికారం ఉంది కదా అని పోలీసులు రెచ్చిపోతున్నారు. తాము ఏం చేసినా చెల్లుతుందనే విధంగా చెలరేగిపోతున్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం, పొరపాటున ఎవరైనా అదేమిటని ప్రశ్నిస్తే చితక్కొట్టడం, ఇదీ పలువురు లేడీ ఎస్సైల వరస. ఇటీవల, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు ఎస్సై వరలక్ష్మి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. తమ కూతురు కనిపించడం లేదు మేడమ్‌, అంటూ కంప్లైంట్‌ ఇస్తే నోటికొచ్చినట్లు తిడుతూ దంపతులను వేధించింది. ఆమె కనిపించకపోతే మమ్మల్నేం చేయమంటావ్‌, వెళ్లి విషం తాగి చావండి అంటూ బెదిరింపులకు దిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి