Viral Video: ఈ దొంగ మాములోడు కాదు.. పోలీస్ బైక్‌నే దొంగతనం చేశాడు.. వీడియో చూసి షాక్ అవుతున్న పోలీసులు..
ఈ దొంగ మాములోడు కాదు. పోలీస్ స్టేషన్ ముందే పోలీస్ బైకే దొంగతనం చేశాడు. దీంతో కాప్స్ వెంటనే రంగలోకి దిగి.. అతడి కోసం వేట మొదలెట్టారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం
ఈ దొంగ మాములోడు కాదు. పోలీస్ స్టేషన్ ముందే పోలీస్ బైకే దొంగతనం చేశాడు. దీంతో కాప్స్ వెంటనే రంగలోకి దిగి.. అతడి కోసం వేట మొదలెట్టారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ జీపు ముందు ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం భయం.. బెరుకు లేకుండా.. తాపీగా నడుచుకుంటూ వచ్చి బైక్ తస్కరించి పరారయ్యాడు. ఈ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. దీంతో ఖాకీలకు కోపం వచ్చింది. తామంటే కనీసం లెక్క లేకుండా వ్యవహరించిన దొంగకు చుక్కలు చూపించాలని డిసైడయ్యారు. వెంటనే రంగంలోకి దిగి.. అన్ని మార్గాల్లో పోలీసులను అలెర్ట్ చేశాడు. దీంతో గంటల వ్యవధిలోనే దొంగ చిక్కాడు. నిందితుడు విజయవాడ నుంచి గుంటూరు వెళ్తుండగా పట్టుకున్నారు. అపహరించిన వ్యక్తిని కంచికచర్లకు చెందిన 22 ఏళ్ళ నండ్రు మాణిక్యాలరావుగా గుర్తించారు. కాగా ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు కూడా పోలీసులు ఇంతే ఫాస్ట్‌గా రియాక్టయితే బాగుంటుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్‌లో దర్శనం!
లైక్స్ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

