Andhra Pradesh: బ్యానర్లు, ఫ్లెక్సీలపై నిషేధం అప్పటివరకే ఉంటుంది.. ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన వంగలపూడి అనిత
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఫ్లెక్సీల ఏర్పాటుపై నిషేధం విధిస్తూ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీలపై..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఫ్లెక్సీల ఏర్పాటుపై నిషేధం విధిస్తూ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీలపై నిషేధం కూడా సినిమా టికెట్ వ్యవహారంలానే అవుతుందా అని ప్రశ్నించారు. గతంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా విడుదలయ్యే వరకు సినిమా టికెట్ ధరలు తగ్గించి, ఆ తర్వాత పెంచారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వరకే అమలు చేసి, తర్వాత ఎత్తేస్తారని విమర్శించారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ కంటే ముందు జగన్‌ను బ్యాన్ చేయాలని, లేకుంటే ఏపీనే బ్యాన్ అయ్యే పరిస్థితి వస్తుందని వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీల బ్యాన్ కూడా సినిమా టికెట్ రేట్ల వ్యవహారం లానేనా? పవన్ కళ్యాణ్ సినిమా విడుదల వరకూ తగ్గిన టికెట్ రేట్లు ఆ తర్వాత మళ్ళీ పెరిగినట్లు, ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్ల మీద బ్యాన్ కూడా @PawanKalyan పుట్టినరోజు వరకూ ఉండి ఆ తర్వాత మాయమవుతుందా? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. కాగా.. విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని, అనేక సమస్యలు వస్తున్నాయని చెప్పారు. రాజకీయ పార్టీలు ప్రధానంగా ప్లాస్టిక్ మీదనే ఆధారపడుతున్నాయని, ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ జెండాలు, వంటి ప్రతి ఒక్క వస్తువూ ప్లాస్టిక్ మయం అయిపోయిందన్నారు. రేటు ఎక్కువైనా సరే క్లాత్‌తో చేసిన బ్యానర్లే కట్టాలన్నారు. తిరుమల ఇప్పటికే ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా మారింది. అక్కడ మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానం అమలు చేస్తామన్నారు. 2027 నాటికి పూర్తిగా ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్‌గా మారాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
ఈ ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీల బ్యాన్ కూడా సినిమా టికెట్ రేట్ల వ్యవహారం లానేనా? పవన్ కళ్యాణ్ సినిమా విడుదల వరకూ తగ్గిన టికెట్ రేట్లు ఆ తర్వాత మళ్ళీ పెరిగినట్లు, ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్ల మీద బ్యాన్ కూడా @PawanKalyan గారి పుట్టినరోజు వరకూ ఉండి ఆ తర్వాత మాయమవుతుందా?
— Anitha Vangalapudi (@Anitha_TDP) August 28, 2022
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..