Tribal Police: ఈ పోలీసులు వెరీ వెరీ స్పెషల్.. గిరి యువత భవిష్యత్ కు భద్రత కల్పిస్తూ.. ఉపాధి కల్పనకు శిక్షణ
యువత ఉన్నత చదువులు చదివినా.. వారికి ఉద్యోగాలు రాక ఆర్థిక ఇబ్బంది అధైర్య పడుతుంటారు. ఇక మారుమూల అడవి ప్రాంతంలో నివసించే గిరిజన యువత పరిస్థితి మరి దారుణం. కొండ కోనల్లో నివసిస్తూ సుదూర ప్రాంతాలకు కాలినడకన వెళ్లి..
Tribal Police: వాళ్లంతా కొండకోనల్లో నివసించే ఆదివాసీలు బిడ్డలు. అందుబాటులో ఉన్న విద్యను అభ్యసించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ మరో లోకం తెలియని ఆదివాసుల్లో ఇప్పటికే చాలామంది ఆ గిరిజన గూడెలకే పరిమితమయ్యారు. మరికొంతమంది.. చట్ట వ్యతిరేక కార్యకలాపాల బాట పట్టారు. ఈ సమయంలో అల్లూరి జిల్లా పోలీసులు మారుమూల ప్రాంతాల్లోనే అడవి బిడ్డలకు ఉపాధి భరోసా కల్పిస్తున్నారు. శిక్షణను ఇవ్వడమే కాకుండా ఉపాధి చూపిస్తున్నారు.
యువత ఉన్నత చదువులు చదివినా.. వారికి ఉద్యోగాలు రాక ఆర్థిక ఇబ్బంది అధైర్య పడుతుంటారు. ఇక మారుమూల అడవి ప్రాంతంలో నివసించే గిరిజన యువత పరిస్థితి మరి దారుణం. కొండ కోనల్లో నివసిస్తూ సుదూర ప్రాంతాలకు కాలినడకన వెళ్లి.. చదువుకున్నా ఉపాధి ఇచ్చే మార్గాలు వారికి కనిపించవు. దీంతో కొంతమంది పెడదోవ పడుతుంటారు. జీవనం కోసం… చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వైపు మొగ్గు చూపుతుంటారు. కొందరు గంజాయి స్మగ్లింగ్ వైపు, మరికొందరు మావోయిస్టుల వైపు చూస్తూ ఉంటారు. దీంతో ఇక వాటిని చెక్ పెట్టేందుకు అల్లూరు జిల్లా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఎస్పీ సతీష్ నేతృత్వంలో మారుమూల ప్రాంతాల్లోనే నివసించే ఆదివాసీల యువతకు ఉపాధి మార్గాలు కల్పిస్తున్నారు.
మూడు నెలల క్రితం ప్రయాణ అనే కార్యక్రమం ద్వారా.. గిరిజన నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు పోలీసులు. ముంచంగిపుట్టు, పెదబయలు, జి మాడుగుల, వై రామవరం ప్రాంతాల్లోనే మారుమూల గ్రామాలకు చెందిన వారిపై ప్రత్యేకంగా దృశ్య సారించి.. ఉపాధ్యక్షుక్షణ కల్పించారు. 35 మందిని ఎంపీగా చేసి శ్రీకాకుళం జిల్లాలో హోమ్ నర్సింగ్ శిక్షణను ఇచ్చారు. అందులో నుండి 17 మంది యువతులను హైదరాబాద్ రెడ్ క్రాస్ సెంటర్ కి ఉపాధి అవకాశాలను కల్పించారు పోలీసులు. ఉద్యోగాలు పొందిన యువతులు.. తమకు అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు అడవి నుంచి నగరం బాట పట్టారు. ఆనందంతో ఉద్యోగాలు కోసం బయలుదేరారు. పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత.. గిరిజన మారుమూల ప్రాంతాల్లోని అడవి బిడ్డలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం అన్నారు అధికారులు. పోలీసులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే గిరిజన యువతలో మమేకమవుతూ క్రీడా సామాగ్రిని, గిరిజనులకు మందులు పంపిణీ చేసిన పోలీసులు… ఎప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా భావించే మారుమూల గ్రామాల్లోని గిరి యువతకు ఉపాధి మార్గాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఎస్పి సతీష్.
ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పుట్టి అంతంత మాత్రమే వసతి సౌకర్యాలతో విద్య పూర్తి చేసి.. ఉద్యోగాలు వస్తాయో రావోనని ఆందోళనతో ఉన్న గిరి యువతకు పోలీసుల ఇస్తున్న ప్రోత్సాహం కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. వారి జీవితానికి భరోసా కల్పిస్తోంది. పోలీసులు చూపుతున్న చొరవకు ఆగిరిపుత్రులు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. మరింత మంది ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.
Reporter: Khaja, TV9 Telugu
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..