AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

 Fact Check: ఏపీలో వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారి నుంచి ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తుందా..?

వినాయక చవితి ఉత్సవాలపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గణేశ్ మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ...

 Fact Check: ఏపీలో వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారి నుంచి ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తుందా..?
Lord Ganesha Temples
Ganesh Mudavath
|

Updated on: Aug 28, 2022 | 8:22 PM

Share

ఏపీలో వినాయల మండపాలు ఏర్పాటు చేస్తున్నవారి నుంచి ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తుందన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఈ విషయంపై దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ క్లారిటీ ఇచ్చారు.  వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. గణేష్ మండపాలకు రుసుములు వసూలు చేస్తున్నారని సోషల్ మీడియా(Social media)లో కొందరు తప్పడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. మండపాలు ఏర్పాటుకు ఎటువంటి రుసువులు వసూలు చేయడం లేదని, సంబంధిత మండపాలు ఏర్పాటు చేసేందుకు స్థానిక పోలీస్, రెవెన్యూ అధికారులను సంప్రదించాలన్నారు. చట్టపరంగా తీసుకోవలసిన అనుమతులు ఏవైనా ఉంటే రెవెన్యూ, పోలీస్ శాఖను సంప్రదించి తీసుకోవాలన్నారు. అది మినహాయించి ఏ రకమైన రుసుము గాని.. చందాలు గాని అధికారులు తీసుకున్నట్లు తేలితే.. వారిపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తే.. వారి గురించి కూడా పోలీసులను ఆశ్రయిస్తామన్నారు. ఇటువంటి అబద్ధపు నిరాధార ప్రచారాన్ని ప్రజలు భక్తులు నమ్మవద్దని… వినాయక చవితి పర్వదినాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆయన కోరారు. ఎక్కడైనా మండపాలకు రుసుము వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ తెలిపారు.

ప్రభుత్వంపై  బీజేపీ గరం.. గరం…

ఏపీలో వినాయక మంటపాల రాజకీయం రోజు రోజుకీ ముదురుతోంది. తాజాగా దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులపై బీజేపీ నేత సోము వీర్రాజు మండిపడ్డాడరు. నిబంధనలు లేవంటూనే ఫైర్, విద్యుత్, పోలీసు శాఖల పర్మిషన్లు తీసుకోవాలని చెప్పడం నిబంధనలు కాకపోతే మరేంటని ప్రశ్నించారు. అలా రూల్స్ పేరుతో ఉత్సవాలను అడ్డుకుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని అన్నారు. ఏపీ ప్రజలు ఈ నిబంధనలు ఏవీ పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు. రాజమండ్రిలో వినాయక చవితి వేడుకల్లో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే తాను పాల్గొంటానని దమ్ముంటే తనను అడ్డుకోవాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..