AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konaseema: ఈ గ్రామ వాలంటీర్ వెరీ వెరీ స్పెషల్.. కొబ్బరి తోటలో అంతర పంటగా ఏ పంట పండిస్తున్నాడంటే

రోజు రోజుకీ పెరుగుతున్న ఖర్చులతో కోనసీమలోని కొబ్బరి రైతు దిక్కు తోచని స్థితిలోకి చేరుకున్నాడు. అయితే కొబ్బరి రైతులకు అంతర్ పంటగా ద్రాక్షను పండించవచ్చని నిరూపిస్తున్నాడు గ్రామం వాలంటీర్ లక్ష్మణ్. 

Konaseema: ఈ గ్రామ వాలంటీర్ వెరీ వెరీ స్పెషల్.. కొబ్బరి తోటలో అంతర పంటగా ఏ పంట పండిస్తున్నాడంటే
Konaseema Farmer
Surya Kala
|

Updated on: Aug 28, 2022 | 8:19 PM

Share

Konaseema: ఒకప్పుడు కోనసీమకు బ్రాండ్ అంబాసిడర్ అయిన కొబ్బరి పంటకు ఆకు తెగులు సోకడంతో దిగుబడి తగ్గిపోయింది. అంతేకాదు కొబ్బరి కాయ ధర కూడా సగానికి సగం తగ్గిపోవడంతో ఆదాయం గణనీయంగా పడిపోయింది. రోజు రోజుకీ పెరుగుతున్న ఖర్చులతో కోనసీమలోని కొబ్బరి రైతు దిక్కు తోచని స్థితిలోకి చేరుకున్నాడు. అయితే కొబ్బరి రైతులకు అంతర్ పంటగా ద్రాక్షను పండించవచ్చని నిరూపిస్తున్నాడు గ్రామం వాలంటీర్ లక్ష్మణ్.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం పాశర్ల పూడిలో గ్రామ వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ అనే యువకుడు సంవత్సరం కాలం క్రితం కడియపులంక నుండి ద్రాక్ష తీగను తీసుకొచ్చాడు. దానిని కొబ్బరి మొక్కల మధ్య పెంచడం ప్రారంభించాడు. ద్రాక్ష తీగను పాతిన ఆరు నెలల కాలంలోనే వందల సంఖ్యలో గుత్తులు వేసింది. దీంతో తాను ఆశ్చర్యపడ్డానని లక్ష్మణ్ చెప్పాడు. అంతేకాదు మళ్ళీ ద్రాక్ష తీగలు భారీగా పంట దిగుబడిని ఇస్తూ.. రెండవ పంట ఇపుడు వందల సంఖ్యలో గుత్తులు వేయటం మరింత ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నాడు. ఈ ద్రాక్ష పాదును చూడడానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్లు అధిక సంఖ్యలో వస్తున్నారు. అది తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని లక్ష్మణ్  హర్షం వ్యక్తం చేశాడు. హైదరాబాద్ వంటి మట్టి నేలలో పండే ఈ ద్రాక్ష పంట కోనసీమ ప్రాంతంలో కూడా పండటం విశేషమని అంటున్నాడు. అంతేకాదు.. కొంచెం శ్రద్ధ పెడితే.. కొబ్బరి తోటలలో ద్రాక్ష తోటను అంతర్ పంటగా పండించి లాభాలు ఆర్జించవచ్చని చెబుతున్నాడు. తాను పెంచిన ద్రాక్ష చెట్టు పెరగడానికి ఎటువంటి క్రిమిసంహార మందులు వాడలేదని మార్కెట్లో దొరికే ద్రాక్ష పండ్లు కంటే ఇవి చాలా తీయగా ఉండటం విశేషమని వాలంటీర్ లక్ష్మణ్ చెప్పాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Reporter: Pradeep, TV9 Telugu

కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..
టీం హోటల్‌లో రోహిత్ శర్మ చేయి పట్టుకుని లాగిన మహిళ..?
టీం హోటల్‌లో రోహిత్ శర్మ చేయి పట్టుకుని లాగిన మహిళ..?
హైదరాబాద్‌లో స్విస్ మాల్.. ప్రపంచంలోనే తొలిసారిగా..
హైదరాబాద్‌లో స్విస్ మాల్.. ప్రపంచంలోనే తొలిసారిగా..
రూ.2లక్షలు ఉంటే చాలు.. ఈ కొత్త కారు మీ ఇంటి ముందు ఉంటుంది..!
రూ.2లక్షలు ఉంటే చాలు.. ఈ కొత్త కారు మీ ఇంటి ముందు ఉంటుంది..!
జైల్లో ఉన్న భర్తను బెయిల్‌పై బయటకు తెచ్చిమరీ చంపిన భార్య..
జైల్లో ఉన్న భర్తను బెయిల్‌పై బయటకు తెచ్చిమరీ చంపిన భార్య..
'ఎన్టీఆర్‌కి ఓ కథ చెప్తే.. ఎక్కడో దొబ్బేశావ్ కదా అని అన్నారు'
'ఎన్టీఆర్‌కి ఓ కథ చెప్తే.. ఎక్కడో దొబ్బేశావ్ కదా అని అన్నారు'
జామకాయ వీరికి యమ డేంజర్.. తిన్నారో ఈ సమస్యలు ఖాయం..
జామకాయ వీరికి యమ డేంజర్.. తిన్నారో ఈ సమస్యలు ఖాయం..
షుగర్ పేషెంట్లు చేపలు తినొచ్చా? నిపుణుల సూచనలు ఇవే..!
షుగర్ పేషెంట్లు చేపలు తినొచ్చా? నిపుణుల సూచనలు ఇవే..!
ఆ టీం ట్రోఫీ గెలవాలని అస్సలు కోరుకోను..: ధోని ఆసక్తికర వ్యాఖ్యలు
ఆ టీం ట్రోఫీ గెలవాలని అస్సలు కోరుకోను..: ధోని ఆసక్తికర వ్యాఖ్యలు
పిల్లలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారా..? తల్లిదండ్రులు ఏం చేయాలి?
పిల్లలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారా..? తల్లిదండ్రులు ఏం చేయాలి?