Viral Video: సెంటర్‌కి వెళ్లీ మరీ మహిళతో మసాజ్.. మూల్యం చెల్లించుకున్న ఇన్‌స్పెక్టర్

ఒక మహిళ ఇన్‌స్పెక్టర్ కి మసాజ్ చేస్తుండగా. ఓ వ్యక్తి ఆ సమయంలో వీడియో తీస్తున్నప్పుడు ఆ మహిళా కార్మికురాలు అతడిని చూసి నవ్వుతోంది. దీంతో ఆ మహిళకు వీడియో తీసినట్లు తెలిసిందని తెలుస్తోంది. 

Viral Video: సెంటర్‌కి వెళ్లీ మరీ మహిళతో మసాజ్.. మూల్యం చెల్లించుకున్న ఇన్‌స్పెక్టర్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Aug 27, 2022 | 8:42 PM

Viral Video:  ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మసాజ్ పార్లర్‌లో మహిళా కార్మికురాలిపై దాడి చేసిన కేసు ఇంకా చల్లారలేదు.. మరో ఇన్‌స్పెక్టర్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇన్‌స్పెక్టర్ ఓ మసాజ్ పార్లర్‌లో మహిళా కార్మికుడితో మసాజ్ చేయించుకున్నారు. మసాజ్ సమయంలో ఇన్‌స్పెక్టర్ యూనిఫాంలో ఉన్నారు. వైరల్ వీడియోపై సమాచారం అందుకున్న ఎస్‌ఎస్పీ శైలేష్ కుమార్ పాండే ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన కూడా సివిల్‌ లైన్‌ పరిధిలోనే జరగడం విశేషం.

రెండు రోజుల క్రితం, సివిల్ లైన్స్‌లోని హాట్ స్టఫ్ కూడలికి సమీపంలో ఉన్న మసాజ్ పార్లర్‌లో ఇన్‌స్పెక్టర్ కలీముల్లా మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ కేసులో ఇన్‌స్పెక్టర్ కలీముల్లాను అరెస్ట్ చేసి జైలుకు పంపిన పోలీసులు.. సివిల్ లైన్స్ ఏరియాలో మరో ఇన్‌స్పెక్టర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

సుభాష్ చౌరహా పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో ఇన్‌స్పెక్టర్ రాకేష్ చంద్ర శర్మ ఓ మసాజ్ పార్లర్‌లో కుర్చీపై కూర్చున్నారు. ఒక మహిళ అతనికి మసాజ్ చేస్తుండగా. ఓ వ్యక్తి ఆ సమయంలో వీడియో తీస్తున్నప్పుడు ఆ మహిళా కార్మికురాలు అతడిని చూసి నవ్వుతోంది. దీంతో ఆ మహిళకు వీడియో తీసినట్లు తెలిసిందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

దీనిపై నగర ఎస్పీ విచారణ: ఈ ఘటన వారం రోజుల క్రితం జరిగిందని చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఎస్‌ఎస్పీ శైలేష్ కుమార్ పాండే ఈ విషయంపై దర్యాప్తు చేయాలని ఎస్పీ సిటీ సంతోష్ కుమార్ మీనాను కోరారు. అదే సమయంలో..  శుక్రవారం అర్థరాత్రి విచారణ నివేదిక రావడంతో, ఎస్‌ఎస్‌పి ఇన్‌స్పెక్టర్ రాకేష్ చంద్ర శర్మను సస్పెండ్ చేశారు.

సోషల్ మీడియాలో హల్ చల్  సమాచారం ప్రకారం, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజలు చాలా షేర్లు, లైక్లు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. మసాజ్ చేసుకోవడం వల్ల వచ్చే నష్టమేమిటని పలువురు ప్రశ్నించగా.. చాలా మంది సమాధానం కూడా ఇచ్చారు. ఇన్‌స్పెక్టర్ యూనిఫాం ధరించి మసాజ్ చేయించుకోరాదని కొందరు సమాధానం చెబుతున్నారు. ఈ సస్పెన్షన్‌ పై పోలీసులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..