AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IT Raids: అధికారి ఇంట్లో ఐటీ సోదాలు.. భారీగా ఆస్తులు, బంగారం, కోట్ల నగదు స్వాధీనం..కొనసాగుతున్న నగదు లెక్కింపు

ఇంజనీర్ సంజయ్ కుమార్ ఇంట్లో ఐటీ అధికారులు దాడి చేశారు. దాదాపు ఐదు కోట్ల రూపాయల నగదు, పలు కీలక పత్రాలు కూడా లభ్యమయ్యాయి. తఖీల్లో దొరికిన నగదు రికవరీ అయిన తర్వాత నోట్ల లెక్కింపు కోసం యంత్రాన్ని ఆర్డర్ చేయాల్సి వచ్చింది.

IT Raids: అధికారి ఇంట్లో ఐటీ సోదాలు.. భారీగా ఆస్తులు, బంగారం, కోట్ల నగదు స్వాధీనం..కొనసాగుతున్న నగదు లెక్కింపు
Vigilance Officials Raid
Surya Kala
|

Updated on: Aug 27, 2022 | 6:11 PM

Share

IT Raids: బీహార్‌ కు చెందిన ఓ ప్రభుత్వ అధికారి ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడు చేశారు. ఈ దాడుల్లో కట్టల పాములు వెలుగులోకి వస్తున్నాయి.  రాష్ట్ర రాజధాని పాట్నా ,  కిషన్‌గంజ్‌లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్ కుమార్ రాయ్ ఇళ్లపై ఐటీ అధికారుల బ్యూరో బృందం దాడులు చేస్తోంది. ఈ దాడిలో దాదాపు ఐదు కోట్ల రూపాయల నగదు బయల్పడింది. దీంతో పాటు పలు కీలక పత్రాలు కూడా లభ్యమయ్యాయి. తఖీల్లో దొరికిన నగదు రికవరీ అయిన తర్వాత నోట్ల లెక్కింపు కోసం యంత్రాన్ని ఆర్డర్ చేయాల్సి వచ్చింది. సంజయ్ కుమార్ రాయ్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటూ అక్రమంగా నల్లధనం సంపాదిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ దాడిలో నల్లధనం,తో పాటు అక్రమంగా సంపాదించిన అనేక అక్రమ ఆస్తులు బయటపడ్డాయని చెబుతున్నారు. ఉదయం నుంచి ఇంటిపై నిఘా బృందం సోదాలు చేస్తోంది. సంజయ్ కుమార్ ఇంటిపై 13 మంది నిఘా సభ్యులు దాడులు చేస్తున్నారు. ఇంట్లో నుంచి నోట్ల కుప్ప బయటపడడంతో అధికారులు సైతం కంగుతిన్నారు.

కిషన్‌గంజ్ : ఇంజనీర్ సంజయ్ కుమార్ ఇంట్లో ఐదు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కిషన్‌గంజ్ నివాసంలో సుమారు నాలుగు కోట్ల రూపాయలు, పాట్నా నివాసం నుండి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. సంజయ్ కుమార్ రాయ్ రూరల్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లోని కిషన్‌గంజ్ డివిజన్‌లో విధులను నిర్వహిస్తున్నారు. అయితే పట్టుబడిన నగదు లెక్కలు ఇంకా కొనసాగుతున్నాయని.. నోట్ల లెక్కింపు తర్వాతే కచ్చితమైన మొత్తం తేలనుందని చెప్పారు. దీంతో పాటు భారీ మొత్తంలో నగలు రికవరీపై కూడా చర్చ జరుగుతోంది. భూమి, ఇల్లు సహా అనేక అక్రమాస్తులకు చెందిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఐదు చోట్ల దాడులు: శనివారం ఉదయం నుంచి లైన్ మొహల్లాలో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నివాసంతో పాటు అనేక ఇతర ప్రదేశాలలో, రుయిదాసాలో ఉన్న రూరల్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ కార్యాలయంపై పర్యవేక్షణ బృందం దాడులు చేశారు. దీంతో పాటు ఆ శాఖకు చెందిన క్యాసియర్ ఖుర్రం సుల్తాన్ నివాసంలో కూడా దాడులు కొనసాగుతున్నాయి. కిషన్‌గంజ్‌లో మూడు చోట్ల దాడులు నిర్వహిస్తున్నామని, పాట్నాలో కూడా రెండు చోట్ల దాడులు కొనసాగుతున్నాయని నిఘా డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఐదు చోట్ల సోదాలు జరుగుతున్నాయని, దాడులు పూర్తయిన తర్వాతే ఎంత నల్లధనం దాచారో తెలుస్తుందని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..