Bjp vs AAP: ఆప్‌-బీజేపీ మధ్య పీక్స్‌కు చేరిన పొలిటికల్‌ వార్‌.. స్కూళ్ల నిర్మాణంలో అవినీతి అంటూ..

Bjp vs AAP: ఢిల్లీలో ఆప్‌, బీజేపీ మధ్య పొలిటికల్‌ వార్‌ మరింత ముదురుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను మరోసారి..

Bjp vs AAP: ఆప్‌-బీజేపీ మధ్య పీక్స్‌కు చేరిన పొలిటికల్‌ వార్‌.. స్కూళ్ల నిర్మాణంలో అవినీతి అంటూ..
Bjp Vs Aap
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 27, 2022 | 7:41 PM

Bjp vs AAP: ఢిల్లీలో ఆప్‌, బీజేపీ మధ్య పొలిటికల్‌ వార్‌ మరింత ముదురుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను మరోసారి టార్గెట్ చేసింది బీజేపీ. సిసోడియాకు లిక్కర్‌ స్కాంతో పాటు ప్రభుత్వ స్కూళ్ల నిర్మాణంలో కూడా అవినీతితో సంబంధం ఉందని ఆరోపించారు బీజేపీ నేతలు. సిసోడియా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. ఢిల్లీలో ప్రభుత్వ స్కూళ్ల నిర్మాణం పెద్ద స్కామ్‌ అని బీజేపీ నేతలు ఆరోపించారు. స్కూళ్ల నిర్మాణం పేరుతో కాంట్రాక్టర్లకు లబ్ధి చేశారని మండపడ్డారు.

కాగా, బీజేపీ ఆరోపణలను ఆమ్‌ ఆద్మీ పార్టీ తిప్పికొట్టింది. లిక్కర్‌ స్కాంలో సీబీఐ ఇంతవరకు ఏమి కనిపెట్టిందో బయటకు చెప్పాలని నేతలు డిమాండ్‌ చేశారు. సీబీఐ సోదాల్లో ఏమి దొరికిందో చెప్పాలంటూ ఆప్‌ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సైతం బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీబీఐ దాడుల్లో బీజేపీకి ఏమీ దొరకలేదన్నారు సిసోడియా. దేశానికే ఆదర్శంగా ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లను ఆప్‌ సర్కార్‌ తీర్చిదిద్దితే దానిపై కూడా బీజేపీ రాజకీయం సిగ్గుచేటని విమర్శించారు. లిక్కర్‌ స్కాం అంటూ బీజేపీ నానా హడావుడి చేసిందని, అందులో ఏమీ దొరక్కపోవడంతో ఇప్పుడు స్కూళ్ల మీద పడ్డారని మండిపడ్డారు మనీష్‌ సిసోడియా.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..