AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: తాగుబోతు చేసిన తుంటరి పనికి ఉలిక్కి పడ్డ అధికారులు.. చుట్టాలు వెళ్లడం ఇష్టం లేకపోతే మరీ ఇలా చేయాలా.?

Viral News: మందులు బాబులు చేసే హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నిసార్లు వాళ్లు చేసే పనులు చూస్తుంటే నవ్వాలో, తిట్టాలో అర్థం కాదు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఇతరులను ఇబ్బందులకు..

Viral News: తాగుబోతు చేసిన తుంటరి పనికి ఉలిక్కి పడ్డ అధికారులు.. చుట్టాలు వెళ్లడం ఇష్టం లేకపోతే మరీ ఇలా చేయాలా.?
Viral News
Narender Vaitla
|

Updated on: Aug 27, 2022 | 6:31 PM

Share

Viral News: మందులు బాబులు చేసే హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నిసార్లు వాళ్లు చేసే పనులు చూస్తుంటే నవ్వాలో, తిట్టాలో అర్థం కాదు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. తాజాగా చెన్నైలో ఇలాంటి ఓ సంఘటనే జరిగింది. ఓ తాగుబోతు చేసిన పనికి విమానమే ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి కుటుంబీకులు శనివారం దుబాయ్‌ వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. అయితే అతనికి మాత్రం తన కుటుంబీకులు వెళ్లడం ఇష్టం లేదు. దీంతో ఎలాగైనా ప్రోగ్రామ్‌ క్యాన్సల్‌ చేయాలని డిసైడ్‌ అయ్యాడు. ఇందుకోసం ఓ ప్లాన్‌ వేశాడు.

అప్పటికే ఫుల్లుగా మద్యం సేవించిన ఆ వ్యక్తి.. ఎలాగైనా ప్రోగ్రామ్‌ను క్యాన్సల్‌ చేయాలని భావించిన ఆ మందు బాబు ఏకంగా ఎయిర్‌ పోర్ట్‌ సెక్యూరిటీ సిబ్బందికి ఫోన్‌ చేసి దుబాయ్‌ వెళ్తోన్న విమానంలో బాంబ్‌ ఉందని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ అధికారులు విమానంలో తనిఖీలు చేపట్టారు. బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కాల్‌ చేసింది ఎవరనీ ఆరా తీయగా సదరు తాగుబోతు పోలీసులకు దొరికిపోయాడు. ఇదంతా ఎందుకు చేశావని ప్రశ్నించగా.. దుబాయ్‌కి వెళ్లకుండా ఆపేందుకే ఇలా చేశానని చావు కబురు చల్లగా చెప్పాడు. దీంతో పోలీసులు అతగాడి ఆన్సర్‌ విని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..