AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: అందుకే కష్టపడి ఎక్కువ సినిమాలు చేస్తున్నా.. ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్

రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా సినిమాలను లైనప్ చేశారు.

Prabhas: అందుకే కష్టపడి ఎక్కువ సినిమాలు చేస్తున్నా.. ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్
Prabhas
Rajeev Rayala
|

Updated on: Feb 21, 2026 | 3:41 PM

Share

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ప్రభాస్ రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మారుతి దర్శకత్వంలో తెరకెక్కింది. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని విధంగా ప్రేక్షకులను నిరాశపరిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలను లైనప్ చేశారు ప్రభాస్. ఈ సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభాస్ లైనప్ చేసిన సినిమాల్లో సలార్ 2, కల్కి 2, స్పిరిట్ సినిమాలతో పాటు ఫౌజీ సినిమాలు ఉన్నాయి. ఇటీవలే ప్రభాస్ షూటింగ్ లో గాయపడ్డారు. చిన్న గాయమే కావడంతో ప్రభాస్ త్వరగానే కోలుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ ఓ చిన్న సినిమాకు సపోర్ట్ గా నిలిచారు.

ఆ దర్శకుడి చేతిలో మోసపోయా.. ఏడుసార్లు అబార్షన్ చేయించాడు.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్

సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో.. సినిమా టీమ్ ను ఇంటర్వ్యూ చేశారు ప్రభాస్. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కాగా సంతోష్ ఫ్యాన్స్ తరుపున ప్రభాస్ తో మాట్లాడుతూ.. అన్న మీరూ ఎప్పుడూ సినిమాలు చేస్తుండాలి.. మేము మీ సినిమాలు చూస్తుండాలి అని అన్నాడు. దానికి ప్రభాస్ స్పందిస్తూ..

ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఎలా ఉందో.? ఏం చేస్తుందో తెలుసా.?

ఫ్యాన్స్ అందరూ కావాలని అడుగుతున్నారు కాబట్టే.. కష్టపడి ఎక్కువ  సినిమాలు చేస్తున్నా.. కష్టపడి ఏడాది మూడు సినిమాలు చేస్తున్నా.. కానీ రిలీజ్ లు మాత్రం ఒకటి రెండు అవుతున్నాయి.. నేను మాత్రం మూడు సినిమాలు చేస్తున్నా అంటూ నవ్వేశారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కల్కి 2, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2 సినిమాల షూటింగ్ ను మొదలుపెట్టేశారు కూడా.. మరి వీటిలో ఏ సినిమా ముందు విడుదలవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఆమె ఇప్పుడు హీరోయినా..! అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us