Ultrasound: కాన్పూర్‌లో వింత కేసు.. ఈ వ్యక్తికి అల్ట్రాసౌండ్ చేసిన డాక్టర్లకు షాక్.. వైరల్ అవుతున్న వీడియో..
మాములుగా అయితే ఏ వ్యక్తికైనా 2 కిడ్నీలు ఉంటాయ్. కాగా అనారోగ్య కారణాల వల్ల లేదా ఇతరులకు ఒక కిడ్నీ డోనేట్ చేయడం వల్ల.. కేవలం ఒకే ఒక్క కిడ్నీతో బ్రతికేవాళ్లు కూడా ఉంటారు.
మాములుగా అయితే ఏ వ్యక్తికైనా 2 కిడ్నీలు ఉంటాయ్. కాగా అనారోగ్య కారణాల వల్ల లేదా ఇతరులకు ఒక కిడ్నీ డోనేట్ చేయడం వల్ల.. కేవలం ఒకే ఒక్క కిడ్నీతో బ్రతికేవాళ్లు కూడా ఉంటారు. కానీ ఇప్పడు చెప్పబోయే తరహా వ్యక్తులు మాత్రం అరుదు. యూపీలోని కాన్పూర్‌లో ఈ వింత కేసు వెలుగుచూసింది. అక్కడ స్థానికంగా వ్యాపారం చేసే 52 ఏళ్ళ సుశీల్ గుప్తా 2020లో బ్లాడర్ సర్జరీ చేయించుకున్నారు. ఆ సమయంలో అల్ట్రాసౌండ్‌లో ఆయనకు 3 మూత్రపిండాలు ఉన్నట్లు తేలింది. అతనికి మూడు కిడ్నీలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. అతనికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. కాగా ఎవరైనా అవసరం ఉండి అడిగితే తన 3వ కిడ్నీని దానం చేస్తానని గుప్తా చెబుతున్నారు. అంతేకాదు తాను చనిపోయిన తర్వాత.. కళ్లు డొనేట్ చేస్తానని ప్రకటించారు. 3 కిడ్నీలు తనకు దైవం ఇచ్చిన వరం అని పేర్కొన్నారు. ఈ విషయంపై సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఉమేష్ దూబే మాట్లాడుతూ ఒక వ్యక్తికి మూడు కిడ్నీలు ఉన్న సందర్భాలు చాలా అరుదు అని తెలిపారు. అతను అందరిలానే ఆరోగ్యంగా ఉంటాడని.. ఎటువంటి సమస్యలు ఉండవని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Shocking Video: మూడుసార్లు కాటేసినా.., తగ్గలే అంటూ పామును ఎలా పట్టుకున్నాడో మీరే చూడండి..