Viral Video: బూట్ల కోసం చూసుకుని.. తానే నీటిలో బొక్క బోర్లాపడిన యజమాని.. ఫన్నీ వీడియో వైరల్
వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఒక గ్యారేజ్ కనిపిస్తోంది. అక్కడ రోడ్డుపై భారీగా నీరు ప్రవహిస్తోంది.. గ్యారేజ్ యజమాని బయటకు వచ్చి, తన బూట్లను తడవకుండా గ్యారేజ్ నుంచి రోడ్డు మీదకు చేరుకోవాలని యజమాని భావించినట్లున్నాడు
Viral Video: ఉద్యోగం పెద్దదైనా, చిన్నదైనా తన యజమాని పట్ల ఉద్యోగి అనుకువగానే ఉండాలి. యజమాని సంతోషంగా ఉన్నాడో.. అసంతృప్తిగా ఉన్నాడో చూస్తూ.. ఉద్యోగి నడుచుకోవాలిన సందర్భాలు తరచుగా ఏర్పడుతూనే ఉంటాయి. ముఖ్యంగా యజమాని తన ఉద్యోగిని ఏదైనా చేయమని అడిగితే.. దానికి నో చెప్పలేడు. అయితే ఒకొక్కసారి యజమాని ఇచ్చిన ఆర్డర్ తో .. అతని పనిని చేయడానికి తాను చేస్తోన్న పనిని పక్కకు పెట్టిమరీ ఓనర్ ఆజ్ఞను పాటిస్తాడు. అలాంటి సందర్భంలో చోటు చేసుకున్న ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక బాస్ ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండలేరు.
కొంతమంది తాము తమ స్వప్రయోజనాలు, సేఫ్టీనే ముఖ్యమని భావిస్తారు. ఇతరుల గురించి అసలు ఆలోచించరు. ముఖ్యంగా ఇలాంటి కోవకి చెందే వ్యక్తి కొంతమంది బాస్ లు వస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో ఒక యజమాని తన బూట్లు నీటిలో తడవకూడదని భావించాడు. దీంతో సమీపంలో పనిచేస్తున్న కూలీకి పని చెప్పాడు..అయితే బూట్ల కోసం చూసుకుని.. తానే నీటిలో బొక్క బోర్లా పడ్డాడు. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది.
బాస్ ఫన్నీ వీడియోపై ఓ లుక్ వేయండి:
Boss did not want to get his foot wet and asked the employee to put a pallet ? pic.twitter.com/cI1fXWGrnV
— Tansu YEĞEN (@TansuYegen) August 29, 2022
వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఒక గ్యారేజ్ కనిపిస్తోంది. అక్కడ రోడ్డుపై భారీగా నీరు ప్రవహిస్తోంది.. గ్యారేజ్ యజమాని బయటకు వచ్చి, తన బూట్లను తడవకుండా గ్యారేజ్ నుంచి రోడ్డు మీదకు చేరుకోవాలని యజమాని భావించినట్లున్నాడు. దీంతో అక్కడ పనిచేస్తోన్న తన ఉద్యోగికి ఒక చెక్క వంటి దానిని నీరు దాటడానికి వేయమని కోరాడు.. అయితే ఇక్కడే జరిగింది ఓ ట్విస్ట్.. ఉద్యోగి చెక్క వేసిన తర్వాత.. బాస్ ఆ తడి చెక్కమీద కాలు పెట్టీపెట్టగానే.. కాలు జారి.. ఆ నీటిలో బొక్క బోర్లా పడ్డాడు.
ఈ వీడియో @TansuYegen అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఏడు లక్షల మందికి పైగా చూశారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘అందుకే ఎవరి పనిని వారే చేసుకోవాలి’ ఒకరు.. ‘తన క్రింద పనిచేసే వ్యక్తి పనికి ఆటంకం కలిగించకూడదు అని మరొకరు ఇలా రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఫన్నీ గా ఉందని సింబల్స్ ద్వారా తెలియజేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..