Telugu News Trending Student fell down from running bus video was gone viral in social media Telugu News
Video Viral: బస్సు ఫుట్ బోర్డ్ పై స్డూడెంట్స్ డేంజర్ జర్నీ.. కానీ అంతలోనే.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
నగరాల్లోని సిటీ బస్సుల్లో (Bus) ఎంత రద్దీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టూడెంట్స్, ఎంప్లాయిస్, వెండర్స్, వివిధ పనులకు వెళ్లే వారితో నిత్యం కిటకిటలాడుతుంటాయి. ఈ పరిస్థితుల్లోనే కొందరు ప్రమాదకరంగా ప్రయాణం చేస్తుంటారు. నిలబడడానికి..
నగరాల్లోని సిటీ బస్సుల్లో (Bus) ఎంత రద్దీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టూడెంట్స్, ఎంప్లాయిస్, వెండర్స్, వివిధ పనులకు వెళ్లే వారితో నిత్యం కిటకిటలాడుతుంటాయి. ఈ పరిస్థితుల్లోనే కొందరు ప్రమాదకరంగా ప్రయాణం చేస్తుంటారు. నిలబడడానికి కూడా ప్లేస్ లేని బస్సుల్లో ట్రావెల్ (Travel) చేస్తూ ప్రమాదాల బారిన పడుతుంటారు. ఫుట్ బోర్డ్ పై వేలాడుతూ, రన్నింగ్ బస్సు ఎక్కుతూ ఇలా వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు కొందరు. కానీ అది చాలా డేంజర్. ఎందుకంటే రన్నింగ్ లో ఉన్న బస్సు నుంచి ఊహించని విధంగా కిందపడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. గాయాలవడమే కొన్ని సార్లు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంటుంది. ఇలాంటి జర్నీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. అంతే కాకుండా వీటిని చూసేందుకు నెటిజన్లు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లిప్ లో ఓ బస్సు రద్దీకి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటుంది. నిలబడేందుకూ ఖాళీ లేక కొంత మంది స్టూడెంట్స్ ఫుట్ బోర్డ్ పై ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు.
— Indians Amplifying Suffering(IAS) (@ravithinkz) August 30, 2022
ఈ ఎనిమిది సెకన్ల వైరల్ వీడియోలో తమిళనాడు స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీఎన్‌ఎస్‌టీసీ) బస్సు ప్యాసింజర్లతో కిక్కిరిసిపోయింది. అయితే ప్రమాదవశాత్తు ఒక స్టూడెంట్ వేగంగా వెళ్తున్న బస్సు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోతాడు. ఆ సమయంలో వాహనాల రాకపోకలు తక్కువగా ఉండడంతో అతనికి పెద్ద ప్రమాదం జరగలేదు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు ఐదు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ‘తమిళనాడు స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TNSTC) నిర్లక్ష్యానికి కారణంమని, ‘ఈ విద్యార్థులందరూ తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు’ అని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి