AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Data Benefits: మొబైల్ యూజర్లకు బంపరాఫర్.. అన్ లిమిటెడ్ డేటా, మరెన్నో బెనిఫిట్స్.. పూర్తి వివరాలివే

చేతిలో సెల్ ఫోన్, ఫోన్ లో ఇంటర్నెట్ లేనిదే ఈ రోజుల్లో ఏ పనీ జరగడం లేదు. అందుకే టెలికాం సంస్థలు తమ యూజర్లను ఆకట్టుకునేందుకు పలు ఆకర్షణీయమైన ప్లాన్లు ప్రకటిస్తుంటాయి. అన్ లిమిటెడ్ కాల్స్, పరిమితమైన...

Data Benefits: మొబైల్ యూజర్లకు బంపరాఫర్.. అన్ లిమిటెడ్ డేటా, మరెన్నో బెనిఫిట్స్.. పూర్తి వివరాలివే
Unlimited Data Benefits
Ganesh Mudavath
|

Updated on: Sep 02, 2022 | 9:02 AM

Share

చేతిలో సెల్ ఫోన్, ఫోన్ లో ఇంటర్నెట్ లేనిదే ఈ రోజుల్లో ఏ పనీ జరగడం లేదు. అందుకే టెలికాం సంస్థలు తమ యూజర్లను ఆకట్టుకునేందుకు పలు ఆకర్షణీయమైన ప్లాన్లు ప్రకటిస్తుంటాయి. అన్ లిమిటెడ్ కాల్స్, పరిమితమైన డేటా, మెసేజ్ లు ఇలా వివిధ రకాల సదుపాయాలను అందిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ టెలికం సంస్థ భారత్‌ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. విభిన్నమైన బెనిఫిట్స్‌తో ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. అయితే ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఓ ప్లాన్‌ మాత్రం యూజర్లను ఆనందంలో ముంచెత్తింది. రూ.398 ప్రీ పెయిడ్ ప్లాన్‌తో బీఎస్ఎన్ఎల్ ఇస్తున్న బెనిఫిట్స్‌ను ఇతర ఏ టెలికం సంస్థ ఇవ్వడం లేదు. రూ.398 ప్లాన్‌ తీసుకుంటే అన్‌ లిమిటెడ్ డేటా (Unlimited Data), అన్‌ లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. సాధారణంగా ఏ నెట్ వర్క్ లోనైనా డేటా బెనెఫిట్స్ జీబీ ల ప్రకారం ఉంటుంది. ఒక జీబీ, ఒకటిన్నర జీబీ, రెండు జీబీలు ఇలా వివిధ రకాలుగా ఉంటాయి. కానీ బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ మాత్రం వెరీ స్పెషల్. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ డేటా జీబీల చొప్పున లిమిట్ ఏమీ ఉండదు. రోజులో ఎంత డేటా అయినా వాడుకోవచ్చు. అది కూడా హై స్పీడ్‌లో పొందవచ్చు. కాగా.. రూ.398 ప్లాన్‌తో ఈ సదుపాయాలు లభిస్తాయి. ఎంత డేటా వాడుకున్నా హై స్పీడ్‌లోనే దక్కుతుంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.

కాగా.. వొడాఫోన్ ఐడియా కూడా రూ.699 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌తో ఇలాంటి బెనిఫిట్స్ ను అందిస్తోంది. అయితే ప్రీ పెయిడ్‌లో అందించడం లేదు. మీ ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ ఉంటే రూ.398 ప్లాన్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 3జీ నెట్‌వర్క్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సంవత్సరంలోనే దేశంలో 4జీ నెట్‌వర్క్ లాంచ్ చేయాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. ఆగస్టులోనే 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అనుకున్నా మరోసారి ఆలస్యమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..