AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Unseen Pics: విరాట్ అన్‌సీన్ పిక్స్ షేర్ చేసిన ఏబీడీ.. కోహ్లీ, అనుష్క శర్మ షాక్.. రిప్లై ఏమిచ్చారంటే..

Virat Unseen Pics: మూడేళ్ల వైఫల్యాలకు చెక్ పెడుతూ విరాట్ కోహ్లీ మరోసారి తన జూలు విదిల్చాడు. మ్యాచ్‌ల్లో తన సత్తా చాటుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు..

Virat Unseen Pics: విరాట్ అన్‌సీన్ పిక్స్ షేర్ చేసిన ఏబీడీ.. కోహ్లీ, అనుష్క శర్మ షాక్.. రిప్లై ఏమిచ్చారంటే..
Virat Kohli Ab De Villiers
Shiva Prajapati
|

Updated on: Sep 09, 2022 | 1:36 PM

Share

Virat Unseen Pics: మూడేళ్ల వైఫల్యాలకు చెక్ పెడుతూ విరాట్ కోహ్లీ మరోసారి తన జూలు విదిల్చాడు. మ్యాచ్‌ల్లో తన సత్తా చాటుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు కోహ్లీ 71 సెంచరీ చేయగా.. అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఆ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నారు చాలా మంది. అయితే, ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ కోహ్లీ అభిమానులు స్టన్ అయ్యారు. వారే కాదు.. డివిలియర్స్ చేసిన ఈ ఊహించని త్రోబ్యాక్ పోస్ట్ చూసి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ షాక్ అయ్యారు.

వాస్తవానికి కోహ్లీ ట్రిపుల్ డిజిట్ స్కోర్ చేస్తే చూడాలాని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 1020 రోజుల విరామం తరువాత, భారత మాజీ కెప్టెన్ కోహ్లీ కేవలం 61 బంతుల్లో 122 పరుగులు చేసి.. తన మార్క్ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. ఈ స్కోర్‌తో కోహ్లీ తన కెరీర్‌లో 71వ సెంచరీ పూర్తి చేశాడు. దాంతో పలువురు క్రికెటర్లు విరాట్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో తనదైన శైలిలో, డివిలియర్స్ ఇంతకు ముందు ఎవరూ పెద్దగా చూడని త్రోబ్యాక్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోలో డివిలియర్స్, కోహ్లీ ఇద్దరూ స్కూటర్‌పై కూర్చున్నారు. ‘‘ఈ రోజు కోహ్లీ 100 పరుగులు చేసిన సందర్భంగా నేను ఈ పిక్‌ని పంచుకోవాలని అనుకున్నాను. కుమ్మేసెయ్ మిత్రమా. ఇంకా చాలా రావాలి.’’ అని డివిలియర్స్ క్యాప్షన్ పెట్టాడు. అయితే, ఈ త్రో బ్యాక్ ఫోటోపై విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరూ స్పందించారు. ‘హహహహహహహ’ అని కామెంట్‌తో పాటు.. ‘థ్యాంక్యూ బిస్కెట్. లవ్ యూ’ అని రిప్లై ఇచ్చాడు. ఇక అనుష్క శర్మ అయితే, షాక్‌ అయినట్లుగా ‘ఓ మైగాడ్’ అని రిప్లై ఇచ్చింది.

ఇలా డివిలియర్స్ ఫోటో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. విరాట్ అభిమానులు ఆ ఫోటో చూసి మురిసిపోతున్నారు. డివిలియర్స్, కోహ్లీ ఫ్రెండ్షిప్‌కు సలామ్ కొడుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..