Queen Elizabeth 2: చెంపపై ఆటోగ్రాఫ్‌ ఇవ్వాలని క్వీన్‌ ఎలిజబెత్‌ను కోరిన ఆ లెజెండరీ క్రికెటర్‌.. మహారాణి ఏం చేసిందో తెలుసా?

పాతికేళ్ల వయసులోనే బ్రిటన్‌ రాణిగా పట్టాభిషేకం పొందారు క్వీన్‌ ఎలిజబెత్‌-2. సుమారు 70 ఏళ్లకు పైగా పాలించి అత్యధిక కాలం పాటు రాణిగా కొనసాగిన ఘనత దక్కించుకున్నారు. ఇలా ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన ఈ మహారాణి 96 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.

Queen Elizabeth 2: చెంపపై ఆటోగ్రాఫ్‌ ఇవ్వాలని క్వీన్‌ ఎలిజబెత్‌ను కోరిన ఆ లెజెండరీ క్రికెటర్‌.. మహారాణి ఏం చేసిందో తెలుసా?
Queen Elizabeth2
Follow us
Basha Shek

|

Updated on: Sep 09, 2022 | 3:21 PM

పాతికేళ్ల వయసులోనే బ్రిటన్‌ రాణిగా పట్టాభిషేకం పొందారు క్వీన్‌ ఎలిజబెత్‌-2. సుమారు 70 ఏళ్లకు పైగా పాలించి అత్యధిక కాలం పాటు రాణిగా కొనసాగిన ఘనత దక్కించుకున్నారు. ఇలా ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన ఈ మహారాణి 96 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. సమ్మర్‌ వెకేషన్‌ కోసం స్కాట్లాండ్‌లోని బల్మోరన్‌ కోటలో ఉన్న ఆమె గురువారం మధ్యాహ్నం కన్ను మూశారు. ఇదిలా ఉంటే క్వీన్‌ ఎలిజబెత్‌కు క్రీడలతోనూ మంచి అనుబంధముంది. ముఖ్యంగా క్రికెట్‌త. ఇంగ్లండ్‌ టూర్‌కు వచ్చిన అన్ని జట్లను తన నివాసం బహింగ్‌ హమ్‌ ప్యాలెస్‌కు పిలిపించుకునేదామె. వారితో సరదాగా ఫొటోలు దిగడం, కమ్మనైన వంటకాలతో అతిథి మర్యాదలు ఇవ్వడం ఆనవాయితీగా చేసుకున్నారామె. ఈనేపథ్యంలో ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్‌ డెన్నిస్‌ లిల్లీ (Dennis Lillee) క్వీన్‌ ఎలిజబెత్‌ను బాగా అభిమానించేవాడు. ఈనేపథ్యంలో వీరిద్దరికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం తెలుసుకుందాం.

1977లో మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో సెంటనరీ టెస్టు మ్యాచ్‌ నిర్వహించారు. ఆ మ్యాచ్‌కు క్వీన్‌ ఎలిజబెత్‌-2 ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లను రఎలిజబెత్‌ పరిచయం చేసుకున్నారు. ఈక్రమంలోనే అప్పటి ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ డెన్నిస్‌ లిల్లీ తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆటోగ్రాఫ్‌ ఇవ్వాలంటూ తన చెంపను చూపించాడట. అయితే ప్రొటోకాల్‌ సమస్య వల్ల ఎలిజబెత్‌ ఆటోగ్రాఫ్‌ ఇవ్వడానికి నిరాకరించారు. అయితే అతను నిరుత్సాహపడకూడదని తర్వాత తన రాయబారితో సంతకంతో కూడిన ఫొటోగ్రాఫ్‌ను డెన్నిస్‌ లిల్లీకి పంపించారట.ఈక్రమంలో తాజాగా క్వీన్‌ ఎలిజబెత్‌-2 మరణంపై స్పందించిన డెన్నిస్‌ లిల్లీ మరోసారి రాణితో ఉన్న మధుర జ్ఞాపకాన్ని పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..