AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అట్లుంటది మరి సూర్య ప్రతాపమంటే.. ఫ్రిజ్‌ గ్లాస్‌ను ఎలా బద్దలు కొట్టాడో మీరే చూడండి

Asia Cup 2022: ఆసియాకప్‌ నుంచి భారత్‌, ఆఫ్గానిస్తాన్‌ జట్లు నిష్ర్కమించాయి. గురువారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా ఏకపక్ష విజయం సాధించింది.

Viral Video: అట్లుంటది మరి సూర్య ప్రతాపమంటే.. ఫ్రిజ్‌ గ్లాస్‌ను ఎలా బద్దలు కొట్టాడో మీరే చూడండి
Suryakumar Yadav
Basha Shek
|

Updated on: Sep 09, 2022 | 4:27 PM

Share

Asia Cup 2022: ఆసియాకప్‌ నుంచి భారత్‌, ఆఫ్గానిస్తాన్‌ జట్లు నిష్ర్కమించాయి. గురువారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా ఏకపక్ష విజయం సాధించింది. ఏకంగా 101 పరుగుల తేడాతో భారీ గెలుపు అందుకుంది. చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం ఈ మ్యాచ్‌లో ప్రధాన హైలైట్. సుమారు 1021 రోజుల తర్వాత అతను ఓ మ్యాచ్‌లో మూడంకెల స్కోరు చేశాడు. అలాగే కేఎల్ రాహుల్ , రిషబ్ పంత్ కూడా విరాట్‌కు మంచి సహకారం అందించారు . కాగా, మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ త్వరగానే ఔటయ్యాడు. ఎదుర్కొన్న మొదటి బంతిని భారీ సిక్సర్ బాదిన అతను అదే ఊపులో రెండో బంతిని కొట్టబోయి బౌల్డయ్యాడు. అయితే ఈ సిక్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఫరీద్‌ అహ్మద్‌ వేసిన13వ ఓవర్ 5వ బంతిని నేరుగా ఫైన్‌లెగ్‌ దిశలో నేరుగా స్టాండ్స్‌లోకి తరలించాడు సూర్య. అయితే ఆ బంతి డైరెక్టుగా ఆఫ్ఘనిస్తాన్ డగౌట్‌లోని ఫ్రిజ్‌కు తగిలింది. దీంతో ఫ్రిజ్ పైన ఉన్న గ్లాస్ పగిలిపోయింది . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . అయితే అనూహ్యంగా తర్వాతి బంతికే సూర్య పెవిలియన్ చేరాడు . కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ సాయంతో 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది భారత జట్టు . లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ఆఫ్ఘనిస్థాన్‌.. భువనేశ్వర్‌ స్వింగ్‌ అటాక్‌తో కుప్పకూలింది . 21 పరుగులకు ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయింది . ఇబ్రహీం జడార్న్ 64 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు . చివర్లో రషీద్ ఖాన్ 15 పరుగులు, ముజీబ్ ఉర్ రెహమాన్ 18 పరుగులు చేశారు . చివరకు ఆఫ్ఘన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది . భారత్ తరఫున భువనేశ్వర్ 5 వికెట్లతో మెరిశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత