AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వీల్‌ఛైర్‌లో ఫుడ్‌ డెలివరీ చేస్తోన్న యువతి.. వైరల్‌ వీడియోను చూసి హ్యాట్సాఫ్‌ అంటోన్న నెటిజన్లు

Inspiration: ఈ ప్రపంచంలో దివ్యాంగులు చాలామంది ఉన్నారు. కాళ్లు, చేతులు కోల్పోయిన వారు, కళ్లులేని వారు, చెవిటి, మూగవారు..ఇలా మనకు చాలామంది దివ్యాంగులు తారసపడుతుంటారు.

Viral Video: వీల్‌ఛైర్‌లో ఫుడ్‌ డెలివరీ చేస్తోన్న యువతి.. వైరల్‌ వీడియోను చూసి హ్యాట్సాఫ్‌ అంటోన్న నెటిజన్లు
Food Delivery Agent
Basha Shek
|

Updated on: Sep 11, 2022 | 1:35 PM

Share

Inspiration: ఈ ప్రపంచంలో దివ్యాంగులు చాలామంది ఉన్నారు. కాళ్లు, చేతులు కోల్పోయిన వారు, కళ్లులేని వారు, చెవిటి, మూగవారు..ఇలా మనకు చాలామంది దివ్యాంగులు తారసపడుతుంటారు. అయితే వారిని చాలామంది చిన్నచూపు చూస్తుంటారు. జీవితంలో వారింకా సాధించలేరని తేలికగా తీసి పారేస్తుంటారు. అయితే ఈ ఆలోచన తప్పని చాలాసార్లు నిరూపితమైంది. సంకల్పం, పట్టుదల ఉంటే ఎలాంటి అవరోధాలనైనా అధిగమించవచ్చని చాలామంది దివ్యాంగులు నిరూపించారు. నిరూపిస్తూనే ఉన్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడ నెట్టింట్లో దర్శనమిస్తుంటాయి. అవి చూడడానికి ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో మరొకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో దివ్యాంగురాలైన ఓ యువతి వీల్ ఛైర్‌లో కూర్చొని ఫుడ్ డెలివరీ చేస్తోంది.

ఈ వీడియో చూస్తుంటే ఆ యువతి ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఏజెంట్ అని తెలుస్తోంది. అలాగే వీపుపై స్విగ్గీ బ్యాగ్‌ను కూడా మనం చూడవచ్చు. ఆమె ఎక్కడ పనిచేస్తుందో తెలియదు కానీ ఆమె తపనను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వీల్‌చైర్‌ను బైక్‌గా మార్చుకుని కస్టమర్లకు ఫుడ్‌ డెలివరీ చేస్తున్న విధానాన్ని చూసి హ్యాట్సాఫ్ అంటున్నారు. నేటి తరం యువతకు ఆమె ఆదర్శమంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేస్తున్నారు. ఈ ఇన్‌స్పైరింగ్‌ వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేసారు. ‘జిందగీ అనేది చాలా కష్టం.. లైఫ్ లో మనం ఏమీ కోల్పోయినా అంగీకరించాల్సిందే. ఈ మహిళ స్ఫూర్తికి హ్యాట్సాఫ్’ అని దీనికి క్యాప్షన్ ఇచ్చారు. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 2 లక్షలకు పైగా వ్యూస్‌ రావడం విశేషం. అలాగే 10వేల మందికి పైగా లైకులు కొట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..