AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Red Ants: చీమలు బాబోయ్‌ చీమలు.. రాకాసి ఎర్ర చీమల బెడదతో ఊరు ఖాళీ.. ఎక్కడో తెలుసా?

Odisha: ఏంటి చీమ కుడితే.. ఇళ్లు ఖాళీ చేస్తారా? అంతమాత్రానికే ఊరు వదిలిపోతారా? అని పైన హెడ్డింగ్‌ చూసి చాలామందికి అనుమానం రావొచ్చు. అవును మీరు విన్నది నిజమే. ఎర్ర చీమల దండయాత్రంలో అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

Red Ants: చీమలు బాబోయ్‌ చీమలు.. రాకాసి ఎర్ర చీమల బెడదతో ఊరు ఖాళీ.. ఎక్కడో తెలుసా?
Red Ants
Basha Shek
|

Updated on: Sep 10, 2022 | 12:01 PM

Share

Odisha: ఏంటి చీమ కుడితే.. ఇళ్లు ఖాళీ చేస్తారా? అంతమాత్రానికే ఊరు వదిలిపోతారా? అని పైన హెడ్డింగ్‌ చూసి చాలామందికి అనుమానం రావొచ్చు. అవును మీరు విన్నది నిజమే. ఎర్ర చీమల దండయాత్రంలో అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తిన్నా, పడుకున్నా కూడా వారి చుట్టూ చీమల మందును చల్లుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా చీమల దండయాత్ర ఆగడంలేదు. దీంతో శరీరమంతా ఎర్రని దద్దుర్లు, దురదలతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ఇక చివరకు చేసేదేమి లేక ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వదిలిపోతున్నారు. ఇంతకు ఎర్ర చీమల బారిన పడి ఖాళీ అవుతున్న ఆ గ్రామం ఏదో తెలుసా? ఒడిశాలోని పూరీ జిల్లా పిప్పిలి మండలం చంద్రాదెయిపూర్‌ పంచాయతీ బ్రాహ్మణ సాహి.

అప్పుడు లైట్‌ తీసుకున్నారు.. కాగా రెండు నెలల క్రితం చీమలు మొదట ఇళ్లలోకి వచ్చినప్పుడు గ్రామస్తులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ క్రమంగా వాటి సంఖ్య పెరుగుతోంది. అలాగే మనుషులపై ఎక్కువగా దాడి చేస్తుండడం వల్ల వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇటీవల సంభవించిన వరదల తర్వాత చీమల బెడద మరింత ఎక్కువైంది. వీటి బాధ భరించలేక కొందరు ఇప్పటికే వేరే ప్రాంతానికి వలస వెళ్లారు. చీమల నివారణకు అధికారులు క్రిమిసంహారక మందులు వెదజల్లుతున్నా ఫలితం ఉండడం లేదు. ఇళ్లలోని మట్టిగొడల్లో తిష్ట వేసిన చీమలు నిత్యం నరకం చూపిస్తున్నాయని అక్కడి గ్రామ ప్రజలు వాపోతున్నారు.

ఆ చీమ కోసం గాలిస్తున్నాం.. కాగా దీనిపై సీనియర్ శాస్త్రవేత్త సంజయ్ మొహంతి మాట్లాడుతూ ‘ ఈ గ్రామం చుట్టూ నది, అడవులు ఉన్నాయి. ఇటీవల వరద నీరు గ్రామాన్ని ముంచెత్తడంతో.. చీమలు ఊర్లోకి వచ్చాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. గ్రామంలో పురుగుల మందులు పిచికారీ చేస్తున్నాం. దీనిక ప్రధాన కారణం రాణి చీమ. దాన్ని గుర్తించి చంపడమే మా ప్రథమ కర్యవ్యం. ఈ చీమల గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు శాంపిళ్లను ప్రయోగశాలకు పంపాం’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..