ICFRE Jobs 2022: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్‌లో సైంటిస్ట్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖ చెందిన ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE).. 44 సైంటిస్ట్-బీ (Scientist B Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..
ICFRE Dehradun Scientist – B Recruitment 2022: భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖ చెందిన ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE).. 44 సైంటిస్ట్-బీ (Scientist B Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. బయోటెక్నాలజీ, బోటనీ, సెల్యులోజ్ అండ్ పేపర్, కెమిస్ట్రీ, ఫారెస్ట్ ఎకాలజీ, ఎంటమాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జెనెటిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పాథాలజీ, సాయిల్ సైన్స్, వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 21 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 15, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.2000లు, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులు రూ.1000లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు జీతంగా చెల్లిస్తారు.
రాత పరీక్ష విధానం: మొత్తం 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు 400 మార్కులకుగానూ రెండు గంటల సమయంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.