BARC Recruitment 2022: నెలకు రూ.78,000ల జీతంతో భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా..
భారత ప్రభుత్వ ఆణుశక్తి విభాగానికి చెందిన ముంబయిలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్, కోల్‌కతాలోని రేడియేషన్ మెడిసిన్ రిసెర్చ్ సెంటర్ (BARC).. 51 మెడికల్/సైంటిఫిక్ ఆఫీసర్ (Medical Officer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..
BARC Medical/Scientific Officer-C Recruitment 2022: భారత ప్రభుత్వ ఆణుశక్తి విభాగానికి చెందిన ముంబయిలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్, కోల్‌కతాలోని రేడియేషన్ మెడిసిన్ రిసెర్చ్ సెంటర్ (BARC).. 51 మెడికల్/సైంటిఫిక్ ఆఫీసర్ (Medical Officer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, బీవీఎస్సీ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండీ, డీఎన్‌బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో రూ.500ల వరకు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.56,100ల నుంచి రూ.78,800ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- మెడికల్/సైంటిఫిక్ ఆఫీసర్-ఇ(న్యూక్లియర్ మెడిసిన్) పోస్టులు: 1
- మెడికల్/సైంటిఫిక్ ఆఫీసర్-డి(న్యూక్లియర్ మెడిసిన్) పోస్టులు: 2
- మెడికల్/సైంటిఫిక్ ఆఫీసర్-డి(జనరల్ మెడిసిన్) పోస్టులు: 2
- మెడికల్/సైంటిఫిక్ ఆఫీసర్-డి(ఈఎన్‌టీ సర్జన్) పోస్టులు: 1
- మెడికల్/సైంటిఫిక్ ఆఫీసర్-డి(రేడియాలజీ) పోస్టులు: 1
- మెడికల్/సైంటిఫిక్ ఆఫీసర్-డి(హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్) పోస్టులు: 1
- మెడికల్/సైంటిఫిక్ ఆఫీసర్-డి(పీడియాట్రిషియన్) పోస్టులు: 2
- మెడికల్/సైంటిఫిక్ ఆఫీసర్-సి(వెటర్నరీ సర్జన్) పోస్టులు: 1
- మెడికల్/సైంటిఫిక్ ఆఫీసర్-సి(జనరల్ డ్యూటీ/క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్) పోస్టులు: 5
- టెక్నికల్ ఆఫీసర్-సి పోస్టులు: 35
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.