AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సముద్ర తీరంలో మొసళ్ల జాతర.. అడుగుపెడితే ఎముకలు కూడా మిగలవు.. షాకింగ్ వీడియో!

ఎలిగేటర్లు, మొసళ్ళు భూమిపై లేదా నీటి అడుగున మందలుగా నివసించడం తరచుగా కనిపిస్తుంది. అయితే ఒకే చోట వందలాది ఎలిగేటర్లను ఎప్పుడైనా చూశారా? ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో అలాంటిదే సీన్ కనిపిస్తుంది.

Viral Video: సముద్ర తీరంలో మొసళ్ల జాతర.. అడుగుపెడితే ఎముకలు కూడా మిగలవు.. షాకింగ్ వీడియో!
Alligators Viral Video
Surya Kala
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 11, 2022 | 1:46 PM

Share

Viral Video: ఎలిగేటర్లు, మొసళ్ళు ఉభయచరాలు. నేలమీద, నీటిలోనూ నివసించగలవు. ముఖ్యంగా ఇవి నీటిలో ఉన్న సమయంలో ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జంతువులలో ఒకటి. కొన్నిసార్లు అవి సింహాలు, పులుల వంటి భయంకరమైన అడవి జంతువులను కూడా ఓడిస్తాయి. కొన్నిసార్లు అవి వాటి ఆహారంగా మారుతాయి. చాలా ప్రమాదకరమైనవి జంతువులైన మొసళ్ల దగ్గరకు వెళ్లడం అంటే మృత్యువుని కౌగిలించుకోవడం వంటిదే. ఎవరైనా,  ఎప్పుడైనా అనుకోకుండా మొసలి బారిన చిక్కుకుంటే.. ప్రాణాలను కాపాడుకోవడం కష్టమవుతుంది. ఎందుకంటే వాటి దవడలు చాలా శక్తివంతమైనవి. మీరు సోషల్ మీడియాలో మొసళ్ళు కు సంబంధించిన అనేక రకాల వీడియోలను చూసి ఉంటారు . ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వీడియో చూపరులను షాక్ కు గురి చేస్తోంది.

ఎలిగేటర్లు, మొసళ్ళు భూమిపై లేదా నీటి అడుగున మందలుగా నివసించడం తరచుగా కనిపిస్తుంది. అయితే ఒకే చోట వందలాది ఎలిగేటర్లను ఎప్పుడైనా చూశారా? ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో అలాంటిదే సీన్ కనిపిస్తుంది. సముద్రతీరంలో ఎన్ని ఎలిగేటర్లు గుమిగూడాయో వీడియోలో మీరు చూడవచ్చు. ఏదో జాతరకు హాజరైనట్లు కనిపిస్తున్నాయి. చాలా ఆశ్చర్యకరమైన దృశ్యం. అనుకోకుండా ఏదైనా జంతువు లేదా మానవుడు ఈ ప్రదేశంలో చిక్కుకుపోతే.. ఈ వందలాది ఎలిగేటర్ల మధ్య వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహించడానికి కూడా వణికిపోవాల్సిందే. కనీసం ఆ జీవి ఎముకలను లు కూడా మిగలవు.. అందుకనే కొన్ని ప్రాంతాల్లో  ప్రజలు వెళ్లడాన్ని నిషేధించారు.

ఇవి కూడా చదవండి

ఎలిగేటర్‌ల వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓటా_లపౌ అనే IDతో భాగస్వామ్యం చేయబడింది. ఇప్పటివరకు మిలియన్ల మంది వీక్షణలను పొందింది. అయితే మిలియన్ల మంది ప్రజలు వీడియోను ఇష్టపడ్డారు. అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.  ‘కమ్ వాక్ ది బీచ్’ అని ఫన్నీ గా కొంతమంది కామెంట్ చేస్తే.. ఇక్కడికి వెళ్లడం చాలా రిస్క్ అని ఓ యూజర్ రాశారు. కొంతమంది వినియోగదారులు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..