Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సంకల్పం ఉంటే విధి కూడా తలవంచదా.. అద్భుతమైన పెయింటింగ్ వేసిన చేతుల్లేని బాలుడు.. వీడియో వైరల్

అద్భుతమైన బొమ్మ చూపరుల మనసుని హత్తుకుంటుంది. అందమైన పెయింటింగ్స్ వేస్తున్న చేతులు మీరు తప్పక చూసి ఉంటారు. కానీ రెండు చేతులు లేని వారు ఇంత అద్భుతమైన పెయింటింగ్ వేయడం మీరు చాలా అరుదుగా చూసి ఉంటారు.

Viral Video: సంకల్పం ఉంటే విధి కూడా తలవంచదా.. అద్భుతమైన పెయింటింగ్ వేసిన చేతుల్లేని బాలుడు.. వీడియో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Sep 11, 2022 | 10:34 AM

Viral Video: మనసులో ఏదైనా చేయాలనే తపన ఉంటే ఏ పనీ కష్టం కాదని అంటారు. మీరు ప్రతి పనిని సులభంగా పూర్తి చేయవచ్చు. పని చేసే సమయంలో ఏర్పడిన అడ్డంకులను అధిగమించవచ్చు. వికలాంగులు సాధారణంగా జీవితంలో ఏమీ చేయలేరనే భావనను చాలామంది కలిగి ఉంటారు.  అయితే కొందరు అందరికంటే బిన్నంగా ఉంటారు. కళ్ళు లేకపోయినా, చేతులు, కాళ్లు లేకపోవడం వంటి అవయవాల లోపం ఉన్న వికలాంగులు కూడా  తమ జీవితంలో ఏదైనా చేయాలనే కలలు ఉంటాయి. కొంతమంది తమ లోపాలను పక్కనపెట్టి తమ కలలను నెరవేర్చుకుంటారు. అటువంటి పిల్లల వీడియో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ చిన్నారి బాలుడికి చెందిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా బాలుడు ఆత్మస్థైర్యాన్ని నమస్కరిస్తారు. ప్రశంసల వర్షం కురిపిస్తారు.

నిజానికి ఆ చిన్నారికి రెండు చేతులు లేవు. బహుశా ప్రమాదంలో అతని రెండు చేతులు తెగిపోయి ఉండవచ్చు, అయినప్పటికీ ఆ బాలుడు ఆత్మవిశ్వాసం పోగొట్టుకోలేదు. బాలుడు కలలు చెదిరిపోలేదు. తనకు ఉన్న సంగం చేతుల సాయంతో చూపరులను ఉర్రూతలూగించేలా అందమైన పెయింటింగ్స్  వేస్తాడు. వైరల్ అవుతున్న వీడియోలో పిల్లవాడు స్కూల్ క్లాస్‌లో కూర్చున్నారు.  అక్కడ పిల్లలందరూ ఏదో పెయింటింగ్ వేస్తున్నారు. అయితే కెమెరా కళ్ళు చేతులు లేని పిల్లవాడి దగ్గర ఆగిపోయాయి. ఓ బాలుడు ఎంతో ఏకాగ్రతగా తన దృష్టి అంతా పెట్టి.. సూర్యోదయం నీడలో అందమైన చెట్టు బొమ్మను చిత్రీకరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అవును.. ఆ అద్భుతమైన బొమ్మ చూపరుల మనసుని హత్తుకుంటుంది. అందమైన పెయింటింగ్స్ వేస్తున్న చేతులు మీరు తప్పక చూసి ఉంటారు. కానీ రెండు చేతులు లేని వారు ఇంత అద్భుతమైన పెయింటింగ్ వేయడం మీరు చాలా అరుదుగా చూసి ఉంటారు.

చిన్నారికి సంబంధించిన ఈ అద్భుతమైన వీడియోను జార్ఖండ్ డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ప్రతి యుద్ధంలో మీరు గెలవాలంటే, జీవితంలో ప్రతి ఓటమిని మీరు ఓడించాలి’ అని క్యాప్షన్‌లో ఇచ్చారు’. ఈ 9-సెకన్ల వీడియోకు ఇప్పటివరకు వేల సంఖ్యలో వీక్షణలను సొంతం చేసుకుంది. వందల మంది వీడియోను లైక్ చేసారు. కొందరు బాలుడి ఆత్మస్థైర్యాన్ని వందనం చేశారు. ‘ఐక్యూ డిగ్రీ ద్వారా కొలవబడదు..  పరిపక్వత వయస్సు ద్వారా నిర్వచించబడదు ఇది  నేను విన్నాను, ఈరోజు కనులారా చూశానని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..