Kalagnanam: బ్రహ్మంగారు ఈ ఏడాది ప్రపంచంలో ఈ వింతలు జరుగుతాయని చెప్పారు .. 2022లో నిజంగా జరుగనున్నాయా..!

అడ‌వి మృగాలు జవాసాలు బాట పడతాయి. ప‌ట్ట‌ణాలు, ప‌ల్లెల్లో తిరుగుతాయి. అడవులు, అరణ్యాల్లో మంటలు ఏర్పడి.. రోజుల తరబడి మండుతాయి.    కృష్ణ నది మధ్యలో ర‌థం క‌న‌బ‌డుతుంది. ఆ ర‌థాన్ని చూసిన వారి క‌ళ్లు పోతాయి.

Kalagnanam: బ్రహ్మంగారు ఈ ఏడాది ప్రపంచంలో ఈ వింతలు జరుగుతాయని చెప్పారు .. 2022లో నిజంగా జరుగనున్నాయా..!
Veerabrahmendra Swamy
Follow us
Surya Kala

|

Updated on: Sep 10, 2022 | 11:38 AM

Kalagnanam: ప్రపంచంలో ఎక్కడ ఏ వింతలు విశేషాలు చోటు చేసుకున్నా వెంటనే బ్రంహ్మం గారు చెప్పింది నిజం అయింది అని అంటారు. సాక్షాత్తూ దైవ స్వ‌రూపుడైన పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి చెప్పిన కాల‌జ్ఞానంలో ఇవి ఉన్నాయని గుర్తు చేసుకుంటారు. చిన్న‌త‌నం నుండే ఎన్నో మ‌హిమ‌లు చూపిన బ్రహ్మం గారు కలియుగంలో జరగబోయే విశేషాలను, భ‌విష్య‌త్తును త‌న మ‌నోనేత్రంతో దర్శిస్తూ కాల‌జ్ఞానాన్ని ర‌చించారని అంటారు. ఇప్పటి వరకూ బ్ర‌హ్మం గారు చెప్పిన‌వి చాలా వ‌ర‌కు జ‌రిగాయి. మ‌రెన్నో సంఘ‌ట‌న‌లు భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌బోతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రాహ్మణుల సహా ఇతరులు తమ కులవృత్తులను వదిలి ఇతర కర్మలను చేపడతారు. బ్రాహ్మణులు పౌరోహిత్యాన్ని వ‌దిలి ఇత‌ర పనులను చేస్తారు. దీని వలన కలియుగం అంతా అల్ల‌క‌ల్లోలంగా మారుతుంది.

కాశీ ప‌ట్ట‌ణం కొన్ని రోజుల పాటు మూసివేస్తారు. 1910 -12 మ‌ధ్య‌లో గంగా న‌దికి వరదలు వచ్చినప్పుడు.. కలరా తీవ్రంగా వ్యాపించింది. ఆ సమయంలో కాశీని చాలా రోజుల వరకూ దర్శించలేదు. తాజాగా 2020 లో కరోనా మ‌హ‌మ్మారి కారణంగా మ‌రోసారి ఆల‌యం మూత‌బ‌డింది.

ఇవి కూడా చదవండి

సృష్టికి ప్రతిసృష్టి చేయాలంటూ అనేక రకరకాల యంత్రాలను తయారు చేస్తారు.. అవయవాలను అమరుస్తారు. అయితే చావుని తప్పించే యంత్రాన్ని మాత్రం కనిపెట్టలేరు. దేశంలో పెద్ద పొగ మేఘం క‌మ్మ‌కుంటుంది. ప్ర‌జ‌లు దానిలో చిక్కుకుని అధికంగా మరణిస్తారు. కంచి కామాక్షి దేవ‌త‌ కంటి వెంట నీరు కారుతుంది.అనంతరం వేలాదిమంది మ‌ర‌ణిస్తారు. కృష్ణా, గోదావరుల మ‌ధ్య మ‌హా దేవుడు అన్న వాడు జ‌న్మించి అన్య మ‌తాల‌ను స‌మానంగా చూస్తూ గుళ్లు గోపురాలు నిర్మిస్తాడు. పేరు ప్ర‌ఖ్యాతులు పొందుతాడు. మహిళలు నడత తప్పుతారు. వావివరసలు మాయం అవుతాయి. కృష్ణమ్మ దుర్గ‌మ్మ ముక్కు పుడుక‌ను తాకుతుంది. రాజులు బిచ్చగాళ్ళు అవుతారు. భిక్షాటన చేసేవారు ధనవంతులవుతారు.

అడ‌వి మృగాలు జవాసాలు బాట పడతాయి. ప‌ట్ట‌ణాలు, ప‌ల్లెల్లో తిరుగుతాయి. అడవులు, అరణ్యాల్లో మంటలు ఏర్పడి.. రోజుల తరబడి మండుతాయి.    కృష్ణ నది మధ్యలో ర‌థం క‌న‌బ‌డుతుంది. ఆ ర‌థాన్ని చూసిన వారి క‌ళ్లు పోతాయి. రెండు బంగారు హంస‌లు భూమి మీద తిరుగుతాయి. అతిశతో వాటిని పట్టుకోవాలనుకునేవారు నాశనం అవుతారు.

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ‌శైలం ప‌ర్వ‌తంపై మొసలి సంచరిస్తుంది. ఆ మొసలి 8 రోజులు ఉండి భ్ర‌మ‌రాంభ గుడిలో చేరి మేక‌పోతులా అరిచి మాయ‌మ‌వుతుంది. తూర్పు దేశ‌మంతా నవ నాగరికత పేరుతో విచ్చలవిడి తనం పెరుగుతుంది. అధికంగా ధనం సంపాదించినవారు తిరిగి ధ‌న‌హీనులై ద‌రిద్రులైపోతారు. ఇత్త‌డి బంగారం అవుతుంది. వివాహాల్లో కుల‌గోత్రాల ప‌ట్టింపులను వదులుతారు.

వ్యాపారం ధర్మ బద్ధంగా చేయాలనుకునేవారు కనుమరుగవుతారు. ధనార్జనే ధ్యేయంగా జీవితాన్ని సాగిస్తారు. ప్రపంచంలో నదులు ఉప్పొంగుతాయి. వరదలు బీభత్సం సృష్టిస్తాయి. జ‌ల‌ప్ర‌వాహాలు ముంచెత్త‌డం వ‌ల్ల 14 న‌గ‌రాలు మునిగిపోతాయి. ఆనంద నామ సంవ‌త్స‌రాలు 13 గ‌డిచే వ‌ర‌కు ఈ నిద‌ర్శ‌నాలు క‌న‌బ‌డ‌తాయన్నారు. ఇలా జరిగిన సమయంలో తాను మళ్లీ వీర భోగ వసంతరాయులుగా జన్మిస్తానని చెప్పారు.

సేకరణ:

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)