Colour Meditation: మనసు ప్రశాంతత కోసం ధ్యానం గొప్ప మార్గం.. ఏకాగ్రత కోసం రంగులతో ధ్యానం చేయండి ఇలా..

మనస్సు తన గతాన్ని, భవిష్యత్తును మరచి వర్తమానం గురించి మాత్రమే ఆలోచించినప్పుడు ధ్యానం చేయడానికి వీలుకలుగుతుంది. అయితే, ప్రస్తుతం కలర్ మెడిటేషన్ చేయడం చాలా ఈజీగా చేయవచ్చు అంతేకాదు మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

Colour Meditation: మనసు ప్రశాంతత కోసం ధ్యానం గొప్ప మార్గం.. ఏకాగ్రత కోసం రంగులతో ధ్యానం చేయండి ఇలా..
Colour Meditation
Follow us
Surya Kala

|

Updated on: Sep 10, 2022 | 10:33 AM

Colour Meditation: మనందరికీ రంగులంటే అమితమైన ప్రేమ. బాల్యం అంటే మనం రంగులు పూయడం, డ్రాయింగ్ బుక్‌లో రకరకాల బొమ్మలు వేసి  రంగులు నింపడం. నిజానికి ప్రతి ఒక్కరూ రంగులను ఇష్టపడతారు. మన జీవితంలో రంగులకు ముఖ్యమైన స్థానం ఉంది. రంగుల ప్రపంచంలో ద్వారా  చిక్కుల నుండి మనం దూరంగా వెళ్లవచ్చు. రంగుల ద్వారా మీ ఊహలకు రూపం ఇవ్వవచ్చు. అయితే రంగులకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం చాలామందికి తెలియదు. ధ్యానం చేయడానికి రంగులు కూడా గొప్ప మార్గం. ధ్యానం అంటే ప్రశాంత స్థితిలో ఏకాగ్రతపై దృష్టి పెట్టడం.

రంగులతో ధ్యానం చేయండి ధ్యానం వాస్తవానికి.. ఇది కేవలం ఒక పద్ధతి.  మనస్సు లో కలిగే అన్ని ఆలోచనలు, ఇబ్బందులు, ఉద్రిక్తత నుండి విముక్తి నిచ్చి .. ధ్యానం.. ప్రశాంతంగా ఒక విషయంపై కేంద్రీకరించేలా చేస్తుంది. మనస్సు తన గతాన్ని, భవిష్యత్తును మరచి వర్తమానం గురించి మాత్రమే ఆలోచించినప్పుడు ధ్యానం చేయడానికి వీలుకలుగుతుంది. అయితే, ప్రస్తుతం కలర్ మెడిటేషన్ చేయడం చాలా ఈజీగా చేయవచ్చు అంతేకాదు మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

కలర్ మెడిటేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు: మెడికల్ కి గాంగ్ ప్రకారం రంగులను పూరించే సమయంలో మెదడు కదలికలు కుడి , ఎడమ వైపులా చురుకుగా ఉంటాయి. అంతేకాదు సృజనాత్మక ఆలోచన, నిర్ణయం తీసుకోవడం కలిసి జరుగుతుంది. దీని వల్ల మెదడు అభివృద్ధి చెందుతుంది. అంతే కాదు ఇది మన మానసిక ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగుపరుస్తుంది. కలర్ మెడిటేషన్  ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. రంగును నింపేటప్పుడు, మనస్సు  మొత్తం దృష్టి ఇతర చింతలకు దూరంగా రంగును మాత్రమే నింపడంపైనే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇలా ధ్యానం చేయండి ఒకే చోట కూర్చుని కళ్లు మూసుకోండి. అనంతరం మీ శ్వాసపై దృష్టి పెట్టడం కంటే మిమ్మల్ని మీరు ఆనందిస్తూనే రంగులతో ధ్యానం చేయడం సులభం. ఇది మీకు శాంతితో పాటు ఆనందం, సంతృప్తి రెండింటినీ ఇస్తుంది. ఓ కలర్ ఆర్ట్ పూర్తయ్యాక గెలిచినంత ఆనందం కలుగుతుందని అంటున్నారు. ఇది ఒక వ్యక్తికి మానసిక ప్రయోజనాన్ని ఇస్తుంది. కలరింగ్ ధ్యానంలో సహాయపడటమే కాకుండా, సృజనాత్మక నైపుణ్యాలను కూడా పెంచుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా ఉంది. TV9 హిందీ వీటిని ధృవీకరించలేదు. నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి.)