- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti in telugu you will get success in life by adopting the qualities of these 4 birdsమనిషి ఈ 4 పక్షుల నుంచి ఈ లక్షణాలను అలవర్చుకుంటే జీవితంలో విజయం సొంతం అంటోన్న చాణక్య
Chanakya Niti: మనిషి ఈ 4 పక్షుల నుంచి ఈ లక్షణాలను అలవర్చుకుంటే జీవితంలో విజయం సొంతం అంటోన్న చాణక్య
ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో పక్షుల నుండి నేర్చుకోవలసిన కొన్ని లక్షణాల గురించి కూడా పేర్కొన్నాడు. ఈ లక్షణాలను అలవర్చుకోవడం ద్వారా జీవితంలో విజయం సాధించవచ్చు. ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేయడానికి పక్షులలోని ఏ లక్షణాలను అలవర్చుకోవచ్చో తెలుసుకుందాం.
Updated on: Sep 09, 2022 | 6:08 PM

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో పక్షులకు ఉండే కొన్ని లక్షణాల గురించి కూడా ప్రస్తావించాడు. ఈ పక్షుల నుంచి మనిషి లక్షణాలను స్వీకరించడం ద్వారా.. ఆ వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు. ఒక వ్యక్తి ఏయే పక్షులలో ఏయే లక్షణాలను అలవర్చుకోవచ్చో తెలుసుకుందాం.

కొంగ - కొంగకు తన ఇంద్రియాలను ఎలా నియంత్రించాలో తెలుసు. అదే విధంగా సంయమనంతో పని చేస్తే విజయం సులువుగా దొరుకుతుంది, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేని వ్యక్తి ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటాడు. కాబట్టి మీ మనస్సును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి. ఏకాగ్రతతో పని చేయండి.

గోడలలో తేమ: ఇళ్లలోని గోడలపై తేమ పేదరికానికి నిదర్శనమని చాణక్య నీతి చెబుతోంది. సీలింగ్ ఇంట్లోకి తేమ రాకుండా ఇంటి యజమాని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక ఇంటికి సమయానికి మరమ్మతులు చేయడం చాలా ముఖ్యం. గోడలపై తేమ ఎక్కువ కాలం ఉండే ఇళ్లలో సమస్యలు వస్తూనే ఉంటాయి.

కోడి పుంజు - సూర్యోదయానికి ముందే కోడిపుంజు లేస్తుంది. అంతేకాదు వ్యతిరేకశక్తులపై పోరాడుతుంది. ఆహారాన్ని పంచుకోవడం, మీ స్వంత శక్తితో ఆహారం పొందడం. ఈ లక్షణాలన్నీ ఒక వ్యక్తి కోడి నుండి నేర్చుకోవచ్చు. ఈ లక్షణాలు మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి.

డేగ తన లక్ష్యాన్ని సాధించడంలో ఎప్పుడూ విఫలం కాదు. ఎవరూ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించే దిశగా అడుగులు వేయాలి. జాగ్రత్తగా ఆలోచించి సమయం తీసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఎల్లప్పుడూ లక్ష్యం చేరుకోవాలి.





























