Chanakya Niti: ఈ వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయా.. తరచుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తప్పవన్న చాణక్య
Surya Kala |
Updated on: Sep 10, 2022 | 2:48 PM
చాణక్య నీతి ప్రకారం ఇంట్లో అసమ్మతికి వివరాలకు కారణం మనిషి మాత్రమే కాదు, కొన్ని విషయాలు కూడా కావచ్చు. ఇంట్లో ఉండే వస్తువులు కొన్ని సార్లు చెడు జరగడానికి సంకేతంగా పరిగణించబడతాయి. ఎటువంటి వస్తువులు ఇంట్లో ఉంటే ఎలాంటి వివాదాలు జరుగుతాయో చాణక్య నీతి ఏం చెబుతుందో తెలుసుకోండి.
Sep 10, 2022 | 2:48 PM
సందేహం: ఒకరినొకరు ఎప్పుడూ అనుమానించుకోకండి. సంబంధంలో సందేహాలు ఉంటే ఆ సంబంధాన్ని నాశనం చేయవచ్చు.కనుక మీ భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకండి. మీ భాగస్వామి గురించి మీకు ఏవైనా ఆలోచనలు ఉంటే.. వెంటనే మీ భాగస్వామిని అడగడం ద్వారా ఆ అనుమానాన్ని ఆలోచనను దూరం చేసుకోండి.
1 / 5
ఎండిన తులసి మొక్క: ఇంటి ఆవరణలో ఉంచిన తులసి మొక్క ఎండిపోవడం అశుభానికి సంకేతంగా పరిగణిస్తారు. అలా ఎండిన తులసి మొక్క ఉన్న కుటుంబంలో లేదా ఇల్లు అసమ్మతిని లేదా గొడవలను ఎదుర్కోవలసి పరిస్థితులు ఏర్పడొచ్చని చాణక్య నీతి చెబుతోంది. అటువంటి తులసి మొక్కతో అనుబంధాన్ని కలిగి ఉండకుండా.. దానిని గౌరవంగా ఇంటి నుంచి తీసివేయాల్సి ఉంటుంది.
2 / 5
మనస్సులో మోసం ఉన్న వ్యక్తి - తన మాటలను ఇతరులతో ఎప్పుడూ పంచుకోని వ్యక్తిని దూరం ఉంచండి. మీరు నష్టపోతుంటే.. వారు మనసులో సంతోషపడుతుంటారు. మీకు జరిగిన చెడును చూసి సంతోషిస్తారు. బహిర్గతంగా వ్యక్తం చేయకపోయినా లోలోపల సంతోషిస్తారు. మనసుని మోసంతో నింపేసుకుంటారు.
3 / 5
చెడు చేసే వారు - ఆచార్య చాణక్యుడు ప్రకారం మీ వెనుక చెడు చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇతరులకు మీ ముందు చెడు చేసే వ్యక్తి .. రేపు మీకు ఖచ్చితంగా చెడు చేస్తాడు.
4 / 5
గోడలలో తేమ: ఇళ్లలోని గోడలపై తేమ పేదరికానికి నిదర్శనమని చాణక్య నీతి చెబుతోంది. సీలింగ్ ఇంట్లోకి తేమ రాకుండా ఇంటి యజమాని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక ఇంటికి సమయానికి మరమ్మతులు చేయడం చాలా ముఖ్యం. గోడలపై తేమ ఎక్కువ కాలం ఉండే ఇళ్లలో సమస్యలు వస్తూనే ఉంటాయి.