Tirumala: తిరుమలలో పర్యటించనున్న సీఎం జగన్.. 27న శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ.. 28న పరకామణి భవనం ప్రారంభోత్సవం
శ్రీవారి ఆలయం వెలుపల నూతన పరకామణి వాడుకలోకి వచ్చిన అనంతరం.. ఆలయంలోని పాత పరకామణిలో లెక్కింపు నిలిపివేస్తామని చెప్పారు. అధునాతన సౌకర్యాలు, పటిష్టమైన భద్రతతో మొత్తం 26 కోట్లతో పరకామణి భవనం నిర్మిస్తున్నామని పేర్కొన్నారు ధర్మారెడ్డి.
Tirumala: డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో టీటీడీ ఈఓ ధర్మారెడ్డి పాల్గొనున్నారు. ఈ సందర్భంగా భక్తులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అంతేకాదు ఈ నెల 27 నుంచి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం ధర్మారెడ్డి చెప్పారు. 27 న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ప్రకటించారు. 28వ తేదీ సీఎం చేతులమీదుగా నూతన పరకామణి భవనం ప్రారంభోత్సవం జరగనున్నదని పేర్కొన్నారు. పరకామణిలో హుండీ కానుకల లెక్కింపు ను భక్తులు వీక్షించేలా భవనానికి ఇరువైపులా అద్దాలు ఏర్పాటు చేశామని ధర్మ రెడ్డి తెలిపారు.
2.5 కోట్లు విలువ గల చిల్లర నాణేలు వేరు చేసే యంత్రాన్ని దాత విరాళమిస్తున్నారుని.. ఈ యంత్రం ద్వారా 13 రకాల నాణేలను యంత్రం సెగ్రిగేషన్ చేయవచ్చని పేర్కొన్నారు. శ్రీవారి ఆలయం వెలుపల నూతన పరకామణి వాడుకలోకి వచ్చిన అనంతరం.. ఆలయంలోని పాత పరకామణిలో లెక్కింపు నిలిపివేస్తామని చెప్పారు. అధునాతన సౌకర్యాలు, పటిష్టమైన భద్రతతో మొత్తం 26 కోట్లతో పరకామణి భవనం నిర్మిస్తున్నామని పేర్కొన్నారు ధర్మారెడ్డి.
కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అభ్యంతరం వల్ల ముంబైలో శ్రీవారి ఆలయం భూమిపూజ వాయిదా పడిందన్నారు ఈవో ధర్మారెడ్డి. ఆనందనిలయం బంగారు తాపడం పనులపై ఆగమసలహా మండలి, పాలకమండలి సభ్యులతో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..