Innovative Experiment: ఇదేదో కీటకం అనుకుంటే పొరపాటే.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Innovative Experiment: ఇదేదో కీటకం అనుకుంటే పొరపాటే.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Anil kumar poka

|

Updated on: Sep 11, 2022 | 10:01 AM

రోబోల గురించి అందరికీ తెలిసిందే. వాటిగురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మరి సైబోర్గ్‌ అంటే ఏంటో తెలుసా మీకు.. అయితే ఇప్పుడు తెలుసుకోండి.. సైబోర్గ్‌ అంటే.. సగం కీటకం..


రోబోల గురించి అందరికీ తెలిసిందే. వాటిగురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మరి సైబోర్గ్‌ అంటే ఏంటో తెలుసా మీకు.. అయితే ఇప్పుడు తెలుసుకోండి.. సైబోర్గ్‌ అంటే.. సగం కీటకం.. సగం యంత్రం. టెక్నాలజీకి మారుపేరైన జపాన్‌ శాస్త్రవేత్తలు.. మనుషులు నేరుగా వెళ్లలేని ప్రమాదకర ప్రదేశాలను పరిశీలించేందుకు, భూకంపాల వంటి విపత్తుల్లో సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్లలో సహాయపడేందుకు బొద్దింకలపై ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మడగాస్కర్‌కు చెందిన 6 సెం.మీ. పొడవైన కొన్ని బొద్దింకల వీపుపై సౌరశక్తితో పనిచేసే బ్యాక్‌ప్యాక్‌లను అమర్చారు. అతి పలుచగా ఉండే ఈ బ్యాక్‌ప్యాక్‌లు రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేస్తాయి. అలాగే ఆ బొద్దింకల ఉదర భాగం వద్ద ఉండే రెండు కొండేలకు కాళ్ల కదలికలను నియంత్రించే వైర్లను అమర్చారు. అవి బొద్దింకలు వెళ్లాల్సిన దిశను సూచిస్తూ విద్యుత్‌ ప్రేరకాలను పంపుతాయి. తద్వారా వాటిని లక్ష్యంవైపు నడిపించాలన్నది సైంటిస్టుల ఉద్దేశం. శాస్త్రవేత్తలు భావించినట్టుగానే ఈ ప్రయోగం విజయవంతమైందని.. పరికరాలు అమర్చినప్పటికీ బొద్దింకలు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవగలిగాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అణుధార్మికతను సైతం తట్టుకొనే సామర్థ్యం మడగాస్కర్‌ బొద్దింకలకు ఉండటంతో వాటినే ఈ ప్రయోగాలకు ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు. ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలు ఎన్‌పీజే ఫ్లెక్సిబుల్‌ ఎలక్ట్రానిక్స్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Published on: Sep 11, 2022 09:59 AM