Snake Rabbit fight : పాముకు చుక్కలు చూపించిన కుందేలు..! పామును ఎదురించి కొరికి మరీ..
ఈ మధ్య సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా జంతువులు తమ ఆహారాన్ని వేటాడే వీడియోలు నిత్యం మనం చూస్తూ ఉంటాం.. ఈ వీడియో కూడా అలాంటిదే..
ఈ మధ్య సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా జంతువులు తమ ఆహారాన్ని వేటాడే వీడియోలు నిత్యం మనం చూస్తూ ఉంటాం.. ఈ వీడియో కూడా అలాంటిదే.. తమ ప్రాణాలమీదకు వస్తే ఎంత చిన్న జంతువైనా ఎదురు తిరిగి పోరాడుతుందనడానికి ఉదాహరణ. సర్పాలను చూస్తేనే మనం వణికిపోతాం.. అలాంటి పాము ఒక్కసారిగా దాడికి దిగితే.. చిన్న ప్రాణులను ఇట్టే మట్టుపెట్టి తినేస్తాయి. ఈ వీడియోలో పాము కూడా అదే చేయబోయింది. ఓ కుందేలుపై దాడి చేయాలని చూసింది. కానీ ఆ పాముకు ఊహించని షాక్ ఇచ్చింది కుందేలు. ఓ పార్క్ గడ్డిలో ఉన్న ఓ కుందేలు పై ఒక్కసారిగా దాడి చేసింది పాము. ఆ కుందేలును కాటేసి, ఆతర్వాత చుట్టేసి మింగేయాలని ప్రయతించింది. కానీ, కుందేలు ఏమాత్రం భయపడకుండా ఆ పాముతో పోరాడింది. పాముకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా దానిపై ఎదురుదాడికి దిగింది. చివరకు కుందేలును విడిచి పాము వెళ్లిపోతున్నా ఆ కుందేలు మాత్రం దాన్ని వెంబడించి మరీ తరిమింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు

