Woman falling: రోడ్డుపై నడిచేటప్పుడు జాగ్రత్త.. లేదంటే ఇలాగే జరుగుతుంది.. వైరల్ అవుతున్న వీడియో.
రోడ్లపై నడుస్తూ వెళ్లేటప్పుడు, డ్రైవ్ చేస్తున్న సమయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు.
రోడ్లపై నడుస్తూ వెళ్లేటప్పుడు, డ్రైవ్ చేస్తున్న సమయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ఇక వర్షాకాలంలో రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అపాయం తప్పదు. కాగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. రెప్పపాటులో తప్పించుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ రోడ్డుపై నడుస్తుండగా అకస్మాత్తుగా రోడ్డు భూమిలోకి కుంగిపోయి పెద్ద గుంత ఏర్పడింది. ఆమె అందులో పడిపోయింది. అయితే ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మహిళ గోతిలో పడిపోయిన సమయంలో పక్కనే నిలబడి ఉన్న ఓ వ్యక్తి ఆ మహిళను గొయ్యి నుంచి బయటకు తీసేందుకు సహాయం చేసారు. ఈ షాకింగ్ వీడియో ఓ యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను వేలాదిమంది వీక్షిస్తూ.. రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..