Pakistan Currency: పాక్ రూపిని మీరెప్పుడైనా చూశారా.? హయ్యస్ట్ కరెన్సీ నోట్ అక్కడెంతో తెలుసా!

దాయాది దేశమైన పాకిస్తాన్ కరెన్సీని మీరెప్పుడైనా చూశారా.? మన కరెన్సీతో పోలిస్తే.. పాక్ కరెన్సీ విలువ ఎంత ఉంటుంది.?

Pakistan Currency: పాక్ రూపిని మీరెప్పుడైనా చూశారా.? హయ్యస్ట్ కరెన్సీ నోట్ అక్కడెంతో తెలుసా!
Pakistan Currency
Follow us

|

Updated on: Sep 11, 2022 | 1:30 PM

దాయాది దేశమైన పాకిస్తాన్ కరెన్సీని మీరెప్పుడైనా చూశారా.? మన కరెన్సీతో పోలిస్తే.. పాక్ కరెన్సీ విలువ ఎంత ఉంటుంది.? వ్యత్యాసం ఏంటి.? అనే విషయాలు ఏమైనా తెలుసా.? పాక్ కరెన్సీ నోట్ల ముద్రణ ఎలా ఉంటుంది.? లాంటి పలు ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

భారత కరెన్సీతో పోలిస్తే.. పాకిస్తాన్ కరెన్సీ కొంచెం భిన్నంగా ఉంటుంది. మన దగ్గర రూ .1, రూ .2, రూ. 5, రూ. 10, రూ. 20, రూ .50, రూ .100, రూ .200, రూ .500, రూ .2000 చలామణీలో ఉన్నాయి. అలాగే దేశంలో హయ్యస్ట్ కరెన్సీ రూ. 2 వేల నోట్. ఇక పాకిస్తాన్‌లో హయ్యెస్ట్ కరెన్సీ రూ. 5 వేల నోట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సమాచారం ప్రకారం.. ఆ దేశంలో రూ .1, రూ .2, రూ .5, రూ .10 కరెన్సీలు.. నాణేలుగా.. రూ .10, రూ .20, రూ .50, రూ .100, రూ .500, రూ .1000, రూ .5000 నోట్ల రూపంలో చలామణీ అవుతున్నాయి.

పాకిస్తాన్‌లో మన రూపాయి విలువ డబుల్ అవుతుంది. ఒక రూపాయి – 2.82(2.82986PKR) పాకిస్తానీ రూపాయలతో సమానం. అయితే భారత్‌లో పాకిస్తానీ కరెన్సీ విలువ అత్యల్పం. ఒక పాకిస్తానీ రూపాయి – 0.35(0.353375INR) భారత రూపాయికి సమానం. ఇక మన రూ. 2 వేలు విలువ.. పాకిస్తాన్‌లో రూ. 5686.58(PKR)తో సమానం. అలాగే పాక్ హయ్యెస్ట్ కరెన్సీ రూ. 5 వేల నోట్.. రూ. 1,766.87 ఇండియన్ రూపాయిలతో సమానం. మరోవైపు మన రూ. 50 వేలు.. పాకిస్తాన్‌లో రూ. 1,41,493(PKR)తో సమానం. అలాగే పాక్ కరెన్సీలో రూ. 50 వేలు.. మన దగ్గర రూ. 17,668.7 ఇండియన్ రూపాయిలతో సమానం.

ఇదిలా ఉంటే మన ఇండియన్ కరెన్సీపై మహాత్మా గాంధీ చిత్రం ఉన్నట్లుగానే.. పాకిస్తాన్ కరెన్సీపై మహ్మద్ అలీ జిన్నా ఫోటో ఉంటుంది. నోట్ ముందు వైపు జిన్నా ఫోటో.. భారత కరెన్సీ మాదిరిగానే పాకిస్తాన్ నోట్లపై కూడా స్టేట్ బ్యాంక్ మొదలగునవి రాసి ఉంటాయి. మన కరెన్సీ నోట్లపై కీలక సమాచారం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రాసి ఉంటే.. పాకిస్తాన్‌ నోట్లపై ఉర్దూలో ఉంటుంది. ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్’ అని నోట్ పైభాగంలో, క్రింద భాగంలో పలు వాగ్దాన, హామీ వ్యాక్యాలు.. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నర్ అని లిఖించబడి ఉంటుంది. వాటర్‌మార్క్స్, సెక్యూరిటీ థ్రెడ్‌ లాంటి భద్రతాపరమైన ఫీచర్లు పాకిస్తాన్ నోట్లపై ఉన్నాయి. అలాగే వివిధ చారిత్రక ప్రదేశాలకు సంబంధించిన చిత్రాలు సైతం ఉంటాయి. (Pakistan Currency)

ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.