AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: సోనూసూద్‌కి షాక్‌ ఇచ్చిన ఫ్యాన్‌.. దీని బదులు ఆ పని చేసి ఉంటే ఇంకా సంతోషించేవాడినన్న రియల్ హీరో

సిల్వర్‌ స్ర్కీన్‌పై విలన్‌ వేషాలు వేసినా నిజజీవితంలో మాత్రం రియల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సోనూసూద్‌ (Sonu Sood). కరోనా కాలంలో అడిగిందే తడవుగా ఎంతోమందికి ఆపన్న హస్తం అందించాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌.

Sonu Sood: సోనూసూద్‌కి షాక్‌ ఇచ్చిన ఫ్యాన్‌.. దీని బదులు ఆ పని చేసి ఉంటే ఇంకా సంతోషించేవాడినన్న రియల్ హీరో
Sonu Sood
Basha Shek
|

Updated on: Sep 10, 2022 | 2:02 PM

Share

సిల్వర్‌ స్ర్కీన్‌పై విలన్‌ వేషాలు వేసినా నిజజీవితంలో మాత్రం రియల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సోనూసూద్‌ (Sonu Sood). కరోనా కాలంలో అడిగిందే తడవుగా ఎంతోమందికి ఆపన్న హస్తం అందించాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు సోనూసూద్‌. అందుకే అతనికి దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు తోడయ్యారు. ఈనేపథ్యంలో చాలామంది ఫ్యాన్స్ సోనూను కలిసేందుకు నడుచుకుంటూ అతని నివాసానికి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మధు గుర్జార్‌ అనే అభిమాని సోనూసూద్‌పై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు.

రక్తాన్ని వృథా చేయద్దు.. తన రక్తంతో రియల్‌ హీరో పెయింటింగ్‌ వేసిన మధు ఆయనకే గిఫ్ట్‌గా ఇచ్చాడు. కాగా అభిమాని చేసిన పనికి షాక్‌ అయ్యాడు సోనూసూద్‌. రక్తంతో తన బొమ్మను గీయడం కంటే రక్తదానం చేసి ఉంటే ఇంకా సంతోషించేవాడినని చెప్పుకొచ్చాడు. కాగా దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ ‘రక్తం వృథా చేయకుండా దానం చేయాలని ‘ ఫ్యాన్స్‌ను కోరాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ఆచార్య సినిమాలో చివరిగా కనిపించాడు సోనూసూద్‌. ఆతర్వాత చాంద్‌ బార్దాయ్‌ అనే చిత్రంలో కనిపించాడు. ప్రస్తుతం తమిళ్‌తో పాటు మరికొన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.
వాలెంటైన్స్ డే రోజు మీ పార్ట్నర్‌కి అస్సలు ఇవ్వకూడని గిఫ్ట్స్ ఇవే
వాలెంటైన్స్ డే రోజు మీ పార్ట్నర్‌కి అస్సలు ఇవ్వకూడని గిఫ్ట్స్ ఇవే
ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..
ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
మహాశివరాత్రికి ముందుగానే..పురాతన శివాలయంలో అద్భుతం..! భక్తుల క్యూ
మహాశివరాత్రికి ముందుగానే..పురాతన శివాలయంలో అద్భుతం..! భక్తుల క్యూ
T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్..
T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్..
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది