Andhra Pradesh: సామాన్యుడిని వరించిన అదృష్టం.. పొలంలో దొరికిన వజ్రం.. ఎంతకు అమ్ముడు పోయిందో తెలుసా?

Kurnool: తుగ్గలి మండలంలోని ఓ వ్యవసాయ కూలీకి విలువైన వజ్రం దొరికినట్లు సమాచారం. దీనికి స్థానిక వజ్రాల వ్యాపారికి విక్రయించగా రూ.1.50 లక్షకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

Andhra Pradesh: సామాన్యుడిని వరించిన అదృష్టం.. పొలంలో దొరికిన వజ్రం.. ఎంతకు అమ్ముడు పోయిందో తెలుసా?
Representative Image
Follow us
Basha Shek

|

Updated on: Sep 10, 2022 | 11:50 AM

Kurnool: వర్షాలు పడ్డాయంటే చాలు కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని రైతులందరూ పొలాలకు వెళ్లిపోతారు. పక్క ఊరి నుంచి కూడా చాలామంది ఈ ప్రాంతాల్లోని చేలకు వచ్చేస్తుంటారు. అయితే వారంతా పొలం పనులు చేయరు. వజ్రాల వేట కోసం అన్వేషిస్తారు. తుగ్గలి, జొన్నగరి, పగిడిరాయి, ఎర్రగుడి, మద్దికెర, బసినేపల్లి, అగ్రహారం, రాతన, కొత్తూరు తదితర ప్రాంతాల్లో ఈ వజ్రాల వేట ఎక్కువగా ఉంటుంది. చాలామంది సామాన్యులు, కూలీలు ఇక్కడి దొరికన వజ్రాలతో లక్షాధికారులయ్యారు . తాజాగా మరొకరి పంట పండింది. తుగ్గలి మండలంలోని ఓ వ్యవసాయ కూలీకి విలువైన వజ్రం దొరికినట్లు సమాచారం. దీనికి స్థానిక వజ్రాల వ్యాపారికి విక్రయించగా రూ.1.50 లక్షకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా ఇదే ప్రాంతంలో గత నెలలో రెండు విలువైన వజ్రాలు లభ్యమయ్యాయి. జొన్నగిరికి ఒక చెందిన కూలీకి వజ్రం దొరగ్గా దానిని స్థానిక వజ్రాల వ్యాపారి రూ.40 వేలకు కొనుగోలు చేశాడు. అలాగే మరో వ్యక్తికి లభ్యమైన వజ్రం గుత్తికి చెందిన ఓ వ్యాపారి ఏకంగా రూ.3.30 లక్షలకు కొన్నాడు. కాగా ఇక్కడి రైతులకు దొరికిన వజ్రాలను స్థానిక వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత బయటి మార్కెట్లలో కోట్లకు అమ్ముకుని పబ్బం గడుపుతున్నారు. మరోవైపు వజ్రాల అన్వేషణ కోసం బయటి ప్రాంతాల నుంచి చాలామంది ఇక్కడకు వస్తున్నారు. దీంతో తమ పంట పొలాలు నాశనం అవుతున్నాయని ఇక్కడి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి