AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR NATIONAL POLITICS: ప్రగతి భవన్ కు కుమారస్వామి.. జాతీయ రాజకీయాలపై ఇద్దరు నేతల మధ్య చర్చ..?

తెలంగాణ సీఏం కేసీఆర్ జాతీయ పార్టీపై ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్‌ జాతీయ పార్టీపై తీవ్రంగా చర్చ నడుస్తున్న తరుణంలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్‌ పెట్టబోయే జాతీయపార్టీపై ఆయనతో చర్చిస్తున్నారు. కుమారస్వామి..

KCR NATIONAL POLITICS: ప్రగతి భవన్ కు కుమారస్వామి.. జాతీయ రాజకీయాలపై ఇద్దరు నేతల మధ్య చర్చ..?
Kcr With Kumaraswamy (file)
Amarnadh Daneti
|

Updated on: Sep 11, 2022 | 1:47 PM

Share

KCR NATIONAL POLITICS: తెలంగాణ సీఏం కేసీఆర్ జాతీయ పార్టీపై ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్‌ జాతీయ పార్టీపై తీవ్రంగా చర్చ నడుస్తున్న తరుణంలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్‌ పెట్టబోయే జాతీయపార్టీపై ఆయనతో చర్చిస్తున్నారు. కుమారస్వామి ప్రగతిభవన్ కు చేరుకోవడానికి ముందు ఓ హోటల్ లో కుమారస్వామితో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, రాజేందర్‌ రెడ్డి సమావేశమయ్యారు. కుమారస్వామితో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు. దేశంలో తాజా రాజకీయాలతో పాటు ఇతర పరిణామాలపై చర్చించారు. టీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ CM కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. త్వరలోనే నేషనల్‌ పార్టీని పెట్టబోతున్నారు. ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే జాతీయ స్థాయి రాజకీయాల్లో యాక్టివ్‌ కావాలని నిర్ణయించారు. అందుకోసం పార్టీని సిద్ధం చేస్తున్నారు. ఇదే అంశంపై కొద్దిరోజులుగా TRS‌ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో ప్రచారానికి అవసరమైన ఏర్పాట్లూ చేస్తున్నారు. భావ సారూప్యత ఉన్న పార్టీలతో మంతనాలు సాగిస్తున్నారు. సామాజికవేత్తలు, నిపుణులు, మేథావులతో సంప్రదింపులు జరిపారు.

హైదరాబాద్ వేదికగా త్వరలోనే జాతీయ పార్టీ ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు సంకేతాలు పంపాయి. కొత్త పార్టీకి సంబంధించిన విధి విధానాలకు తుది రూపు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. గుణాత్మక మార్పు లక్ష్యంగా ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాతో జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తామని చెప్పకనే చెప్పారు సీఎం కేసీఆర్‌. భారతీయ రాష్ట్ర సమితి, భారతీయ నిర్మాణ సమితి, భారత ప్రజా సమితి వంటి పేర్లలో ఒకటి ఎంపిక చేసే అవకాశమూ ఉంది. టీఆర్‌ఎస్‌ జిల్లాల అధ్యక్షులు తెలంగాణ భవన్‌లో సమావేశమై జాతీయ పార్టీ ఏర్పాటుపై తీర్మానమూ చేశారు. తామంతా కేసీఆర్‌ వెంటే నడుస్తామని ప్రకటించారు. ఇక ఆలస్యం చేయకుండా వీలైంత తొందరలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు పార్టీ శ్రేణులు. ఇదే సమయంలో కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి హైదరాబాద్ వచ్చి ప్రగతి భవన్ లో సీఏం కేసీఆర్ తో సమావేశమయ్యారు. కలిసి లంచ్ కూడా చేశారు. ఇరువురు నేతలు కొత్త పార్టీపై చర్చిస్తున్నారు.

ఇప్పటికే కేసీఆర్ BJPని వ్యతిరేకించే పార్టీల నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. బీహార్ వెళ్లి NDA నుంచి బయటకు వచ్చిన నితీశ్‌కుమార్‌తో సమావేశమయ్యారు. తమది థర్డ్ ప్రంట్ కాదని అసలైన ఫ్రంట్ అని చెప్పుకొచ్చారు. దీంతో పాటు జాతీయ స్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న నాన్ బీజేపీ – నాన్ కాంగ్రెస్ నేతలతో నిరంతరం టచ్‌లో ఉంటూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు కేసీఆర్‌. మొత్తానికి కేసీఆర్‌ త్వరలోనే పార్టీ ప్రకటన ద్వారా జాతీయ రాజకీయాల్లో ఏంట్రీకి సిద్ధమవుతున్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా మొదలుపెట్టిన ఈ యజ్ఞంలో కేసీఆర్‌ తొలి అడుగు రేపోమాపో పడబోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..