Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loan Apps: లోన్ యాప్ లపై కేంద్రం ఉక్కుపాదం.. ఇక వైట్ లిస్ట్ రెడీ చేయనున్న RBI..

ప్రజలను తమ యాప్ నుంచి రుణం తీసుకోవాలంటూ ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తారు. నాకొద్దు బాబోయ్ అన్నా.. లేదు లేదు తీసుకోండి సార్.. మా రూల్స్ వేరు.. వేరే కంపెనీల్లా కాదు.. తక్కవు ఇంటరెస్ట్ అంటూ రుణం తీసుకునేలా ఇంప్రెస్ చేస్తారు. ఇక వారి మాటలకు పడిపోయి లోన్ తీసుకున్నామా..

Loan Apps: లోన్ యాప్ లపై కేంద్రం ఉక్కుపాదం.. ఇక వైట్ లిస్ట్ రెడీ చేయనున్న RBI..
RBI
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 11, 2022 | 1:11 PM

Loan Apps: ప్రజలను తమ యాప్ నుంచి రుణం తీసుకోవాలంటూ ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తారు. నాకొద్దు బాబోయ్ అన్నా.. లేదు లేదు తీసుకోండి సార్.. మా రూల్స్ వేరు.. వేరే కంపెనీల్లా కాదు.. తక్కవు ఇంటరెస్ట్ అంటూ రుణం తీసుకునేలా ఇంప్రెస్ చేస్తారు. ఇక వారి మాటలకు పడిపోయి లోన్ (LOAN) తీసుకున్నామా.. మన పని అయిపోయినట్లే తరువాత నుంచి అధిక వడ్డీలు.. కట్టకపోతే వేధింపులు ఇది ప్రయివేట్ లోన్ యాప్ ల వ్యవహరశైలి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రయివేట్ లోన్ యాప్ ల వేధింపులకు ఎంతో మంది బలయ్యారు. రోజూ లోన్ యాప్ ల ఆగడాలపై వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో కేంద్రప్రభుత్వం (Central Government)  సైతం రంగంలోకి దిగింది. ఇలాంటి యాప్ ల ఆట కట్టించేందుకు లోన్ యాప్ లపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈజీలోన్‌.. నో డాక్యుమెంట్స్‌.. నో ష్యూరిటీ.. చిటికేలో ఖాతాలోకి డబ్బులు జమ. లోన్‌ తీసుకునే వరకు మర్యాద. ఆ తరువాత ప్రత్యక్ష నరకం. పరువు తీస్తామంటూ బెదిరింపులతో పాటు మార్ఫింగ్‌ ఫోటోలతో బ్లాక్‌మెయిలింగ్‌తో ప్రాణాలు బలితీసుకుంటున్న యాప్‌లోన్‌ మాఫియాకు చెక్ పెట్టేందుకు కేంద్రప్రభుత్వం రెడీ అయింది. లోన్‌యాప్‌ నిర్వాహకుల ధనదాహానికి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందో. ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి.

లోన్ యాప్స్‌ ఆగడాలపై ఓ వైపు ప్రభుత్వం సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదు. కేసులైనా, అరెస్టులైనా డోంట్‌ కేర్‌ అంటున్నాయ్‌. చస్తే చావండి, మాకేంటి? చచ్చినా సరే డబ్బు మాత్రం చెల్లించాల్సిందేనని యమకింకరుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు లోన్‌ యాప్‌ ఏజెంట్స్‌. ఈ మధ్య ఈ వ్యవహారాలు శృతిమించిపోవడంతో లోన్ యాప్స్‌ కట్టడిపై కేంద్రం దృష్టి పెట్టింది. చట్టబద్దమైన యాప్‌ల వైట్ లిస్ట్‌ను తయారు చేయాలని ఆర్‌బీఐని ఆదేశించారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)  వైట్ లిస్ట్‌లో ఉన్న లోన్ యాప్‌లను మాత్రమే యాప్ స్టోర్‌లలో హోస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రతీ ఒక్కరూ లోన్‌ యాప్‌ల విషయంలో అవగాహన పెంచుకోవాలంటున్నారు పోలీసులు. ఆర్‌బిఐ అనుమతి ఉందా లేదా అన్నది చెక్‌ చేసుకోవాలంటున్నారు. అప్పు తీర్చినా సరే ఇంకా డబ్బు చెల్లించాలని వేధిస్తే.. వెంటనే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..