Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారంటూ కమలం పార్టీ ఫైర్.. మార్ఫింగ్ విడియో అంటూ కాంగ్రెస్ కౌంటర్..

వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే లక్ష్యంతో కాంగ్రెస్ యువనేత చేపట్టిన భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీని బీజేపీ టార్గెట్ చేసింది. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఓవీడియోను విడుదల చేసింది. ఈవీడియో ఇప్పుడు రాజకీయ..

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారంటూ కమలం పార్టీ ఫైర్.. మార్ఫింగ్ విడియో అంటూ కాంగ్రెస్ కౌంటర్..
Bjp Vs Congress
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 11, 2022 | 12:55 PM

Bharat Jodo Yatra: వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే లక్ష్యంతో కాంగ్రెస్ యువనేత చేపట్టిన భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీని బీజేపీ టార్గెట్ చేసింది. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఓవీడియోను విడుదల చేసింది. ఈవీడియో ఇప్పుడు రాజకీయ రచ్చను రాజేస్తోంది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వ్యక్తితో రాహుల్ చెట్టాపట్టాలేంలంటూ కమలం పార్టీ రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మార్ఫింగ్ వీడియోలతో ఎగిరిపడొద్దని కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్ చేసింది. తమిళనాడులో భారత్ జోడో యాత్ర ముగించుకున్న రాహుల్గ ఆంధీ కేరళకు ఎంటర్ అయ్యారు. అక్కడ పాదయాత్రలో జార్జ్‌ పొన్నయ్య అనే పాస్టర్‌ను రాహుల్‌ గాంధీ కలవడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్‌తో కూడా జార్జ్‌ పొన్నయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపించింది. యేసు ప్రభువు దేవుడా, కాదా? మీరెలా భావిస్తారు? అని రాహుల్‌ ప్రశ్నించగా.. యేసు ప్రభువు నిజమైన దేవుడు. మానవుడిగా భూమిపై జీవించారు. ఆయన శక్తి దేవతల్లాంటి వారు కాదు అంటూ పొన్నయ్య బదులిచ్చిన వీడియోను బీజేపీ నాయకులు విడుదల చేశారు.

భారత్‌ జోడో యాత్ర అసలు రంగు ఈ వీడియోతో బయట పడిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా అన్నారు. నవరాత్రులు ప్రారంభం కానున్న వేళ శక్తి దేవతను ఇలా అవమానించడం దారుణమని మండిపడ్డారు. హిందూ దైవాలను అవమానించడం కాంగ్రెస్‌ పార్టీకి కొత్తేమీ కాదని.. గతంలో రాముడి ఉనికిని ప్రశ్నించిందంటూ విమర్వలు గుప్పించారు. రెచ్చగొట్టే ప్రసంగాలతో గతంలో అరెస్టయిన వ్యక్తిని రాహుల్‌ ఎలా కలుస్తారని ప్రశ్నించారు బీజేపీ నాయకులు. అయితే బీజేపీ మార్ఫింగ్‌ ‌ చేసిన వీడియోను విడుదల చేసి.. నాటకమాడుతోందని కాంగ్రెస్‌ కౌంటరిచ్చింది. రాహుల్‌ భారత్‌ జోడో యాత్రకు వస్తున్న ప్రజా స్పందనను చూసి బీజేపీ నేతలు జీర్ణించుకోలేక ఇలాంటి వీడియోలను విడుదల చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌. ప్రధాని మోదీ ధరించే 10 లక్షల సూట్‌ గురించి తాము ప్రశ్నించాల్సి వస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి