KCR: కాసేపట్లో JDS నేత కుమారస్వామితో సీఏం కేసీఆర్ లంచ్ మీటింగ్.. ప్రధానంగా చర్చించే అంశాలు ఇవేనా..?

తెలంగాణ సీఏం కేసీఆర్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యులర్(JDS) నేత కుమారస్వామి లంచ్ మీటింగ్ కాసేపట్లో జరగనుంది. హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ఇరువురు నేతలు సమావేశం కానున్నారు. ఇప్పటికే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారన్న చర్చ..

KCR: కాసేపట్లో JDS నేత కుమారస్వామితో సీఏం కేసీఆర్ లంచ్ మీటింగ్.. ప్రధానంగా చర్చించే అంశాలు ఇవేనా..?
Kcr With Kumaraswamy (file)
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 11, 2022 | 12:29 PM

KCR National Politics: తెలంగాణ సీఏం కేసీఆర్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యులర్(JDS) నేత కుమారస్వామి లంచ్ మీటింగ్ కాసేపట్లో జరగనుంది. హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ఇరువురు నేతలు సమావేశం కానున్నారు. ఇప్పటికే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారన్న చర్చ సాగుతోంది. గత రెండు రోజులుగా ఈచర్చ మరింత జోరందుకుంది. ఈనేపథ్యంలో కుమారస్వామితో కేసీఆర్ సడన్ గా సమావేశం కావడం మరింత చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవగౌడ, కుమారస్వామితో కేసీఆర్ సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తాజాగా ఇప్పుడు కుమారస్వామి హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇటీవల జేడీయూ నేత, బీహార్ సీఏం నితీష్ కుమార్, జేడీఎస్ నేత కుమారస్వామితో సమావేశమైన విషయం తెలిసిందే. ఇప్పుడు కుమారస్వామి కేసీఆర్ తో భేటీ కానుండం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా జాతీయస్థాయిలో తమతో కలిసొచ్చే పార్టీల గురించి ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న కేసీఆర్.. ఈరెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఓ కూటమిని తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ లేకుండా మూడో ప్రత్యామ్నాయ కూటమి సాధ్యం కాదనే చర్చ కూడా రాజకీయ పండితుల నుంచి వినిపిస్తోంది. ఈనేపథ్యంలో ఏటువంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దానిపై పలువురు నాయకులతో కేసీఆర్ చర్చిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగానే కుమారస్వామితో లంచ్ మీటింగ్ జరపనున్నట్లు సమాచారం.

మరోవైపు ఈనెలలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈలోపు జాతీయపార్టీపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా జాతీయ రాజకీయాలపై చర్చించేందుకే ఈరోజు ఇద్దరు నేతలు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ముందే జాతీయపార్టీపై స్పష్టమైన ప్రకటన చేస్తారా.. లేదా ఢిల్లీ పర్యటన తర్వాత చేస్తారా అనేదానిపై క్లారిటీ రావల్సిన అవసరం ఉంది. మరోవైపు కుమారస్వామితో సమావేశం తర్వాత ఇద్దరు నాయకులు మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇద్దరు నాయకులు మీడియాతో మాట్లాడితే ఎటువంటి అంశాలు మాట్లాడతారనే ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..