బుల్లితెరపై అందాల ముద్దుగుమ్మ.. నెట్టింట గ్లామర్ వయ్యారం..

Rajitha Chanti

Pic credit - Instagram

19 February 2026

బుల్లితెరపై తొలి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అమాకత్వంతో రెండు తెలుగు రాష్ట్రాల ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు మరెవరో కాదు.. ప్రియాంక జైన్. మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులమ ముందుకు వచ్చి పాపులర్ అయ్యింది. 

తొలి సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మరోసారి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించింది.

అదే పాపులారిటీతో బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టింది. అందులో తన ఆట తీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలిచి టాప్ 5 వరకు చేరుకుంది ప్రియాంక జైన్. 

అయితే బిగ్ బాస్ షో తర్వాత సీరియల్స్ మానేసిన ప్రియాంక.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటికే సొంతంగా యూట్యూ్బ్ ఛానల్ స్టార్ట్ చేసింది.

మరోవైపు నెట్టింట గ్లామర్ షోలో తగ్గేదేలే అనిపిస్తుంది. సీరియల్స్ లో పద్దతిగా క్లాసిక్ గా కనిపించిన ఈ అమ్మడు  ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. 

తాజాగా రెడ్ కలర్ లెహంగాలో పూలజడతో ప్రియాంక అదిరిపోయేలా కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేయగా వైరలవుతున్నాయి.

 సీరియల్స్ మానేసిన ప్రియాంక.. ఇప్పుడు సినిమాల్లో సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. అలాగే ఇటు ప్రైవేట్ సాంగ్ ఆల్బమ్స్ సైతం చేస్తూ నెట్టింట యాక్టివ్ గా ఉంటుంది.