AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madugula Halwa: ఫస్ట్ నైట్ స్పెషల్ మాడుగుల హల్వా ఇది.. ఒక్కసారి తిన్నారనుకోండి.!

విశాఖపట్నం జిల్లా మాడుగులలో 130 ఏళ్ల క్రితం ప్రారంభమైన హల్వా తయారీ ఒక బ్రాండ్‌గా ఎదిగింది. శోభనం రాత్రి స్పెషల్‌గా పేరొందిన మాడుగుల హల్వా సంప్రదాయ పద్ధతుల్లో, కట్టెల పొయ్యిపై నాలుగు రోజుల పాటు తయారవుతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Madugula Halwa: ఫస్ట్ నైట్ స్పెషల్ మాడుగుల హల్వా ఇది.. ఒక్కసారి తిన్నారనుకోండి.!
Madugula Halwa
Ravi Kiran
|

Updated on: Feb 19, 2026 | 12:32 PM

Share

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా మాడుగుల అనే చిన్న గ్రామం నుంచి ఒక తీపి బ్రాండ్‌గా అవతరించింది మాడుగుల హల్వా. సుమారు 130 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ హల్వాకు “శోభనం స్పెషల్” అనే ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనికి ఉన్న శక్తి అలాంటిది కాబట్టి తొలి రాత్రి వధూవరులకు దీన్ని వడ్డించే ఆనవాయితీ ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఉంది. ఈ హల్వాను తొలిసారిగా 1890లో దంగేటి ధర్మారావు అనే స్థానిక మిఠాయి వ్యాపారి తయారు చేసినట్లు చెబుతుంటారు. ఆరంభంలో బూడిద గుమ్మడి, కర్బూజా, కొబ్బరికాయలతో హల్వాను తయారుచేసినప్పటికీ, తదనంతరం రెండేళ్ల పాటు ప్రయోగాలు చేసి గోధుమ పాలతో దీనికి విశిష్టమైన రుచిని తీసుకొచ్చారు. మాడుగుల హల్వా తయారీదారులు చెప్పేది ఏమిటంటే, ఈ రుచిని ఎవరూ తీసుకురాలేరని.. దీని రహస్యం సంప్రదాయబద్ధమైన తయారీ విధానంలోనే దాగి ఉంది. కట్టెల పొయ్యిపై కళాయిలలో తయారు చేయడమే దీని రుచికి ప్రధాన కారణమని వివరిస్తారు.

గ్రైండర్లు, మిషన్లను ఉపయోగించకుండా పదార్థాలను రుబ్బడం, చేతితో కలపడం లాంటివి ఇప్పటికీ జరుగుతాయి. ఈ హల్వా తయారీకి నాలుగు రోజుల సమయం పడుతుంది. ఈ ప్రక్రియలో ప్రతి పనినీ ఆయా రంగాలలో నిష్ణాతులైన వారే చేస్తారు. ముఖ్యంగా పాకం పట్టే కళాయిల వద్ద ఎంతో అనుభవజ్ఞులైన వంటవారినే నియమిస్తారు. ఉదయం ఐదు గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగే ఈ పనిలో రోజుకు రూ. 200 నుంచి రూ. 500 వరకు కూలీలు సంపాదిస్తారు. ఈ హల్వా గ్రామంలో చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది. ప్రస్తుతం, మాడుగుల హల్వాపై ఆధారపడి సుమారు 1500 కుటుంబాలు జీవిస్తున్నాయి. పండుగలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లకు ఈ హల్వాకు భారీగా ఆర్డర్లు వస్తుంటాయి. ఈ డిమాండ్‌ను బట్టి, కొందరు మాడుగుల హల్వాను తెచ్చి ఇవ్వడాన్ని కూడా ఒక వ్యాపారంగా మార్చుకున్నారు.

ఇటీవలి కాలంలో వ్యాపారం విస్తరించడంతో, కొందరు వ్యాపారులు ఫుడ్ ప్రాసెసింగ్ లైసెన్సులు తీసుకుని, నాణ్యతా ప్రమాణాలతో కూడిన హల్వాను విక్రయిస్తున్నారు. దీనివల్ల హల్వాలోని క్వాలిటీ, క్యాలరీలు వివరాలు కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు లైసెన్సులతో ఆన్‌లైన్ సేవలను అందిస్తున్నారు. మాడుగుల హల్వా రుచిని చూడని రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు లేరని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఇందిరా గాంధీ, ఎన్.టి.రామారావు, రావు గోపాల్ రావు, కృష్ణ, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్, ఇటీవల రాజమౌళి లాంటి ఎందరో ప్రముఖులు ఈ హల్వా రుచిని ఆస్వాదించారని చెప్పుకొచ్చారు.

Follow Us