AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ సర్కార్ మరో గుడ్‌న్యూస్.. రెండో జాబితా త్వరలోనే.. ముహూర్తం ఫిక్స్..

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. త్వరలోనే రెండో జాబితా విడుదలకు సిద్దమవుతోంది. ఈ జాబితాలో హైదరాబాద్‌లోని పేదలకు ఇళ్లను కేటాయించనుంది. స్థలం లేనివారికి అపార్ట్‌మెంట్లు నిర్మించి ఇళ్లను పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ సర్కార్ మరో గుడ్‌న్యూస్.. రెండో జాబితా త్వరలోనే.. ముహూర్తం ఫిక్స్..
Indiramma Houses
Venkatrao Lella
|

Updated on: Feb 19, 2026 | 8:05 AM

Share

హైదరాబాద్‌లోని పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే నగరంలోని పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా కొత్త ఇళ్లను మంజూరు చేయనుంది. స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు వచ్చే నెలలో మంజూరు పత్రాలు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇక స్థలం లేనివారికి G+5 విధానంలో ఇళ్లు నిర్మించి లబ్దిదారులకు పంపిణీ చేయనుంది. 5 నుంచి 10 అంతస్తుల్లో అపార్ట్‌మెంట్లను నిర్మించి పేదలకు పంపిణీ చేయనున్నారు. నగరంలో ఖాళీగా ఉన్న స్థలాలను ఇందుకోసం గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు. లబ్దిదారులకు తాము ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతాల్లోనే వీటిని నిర్మించి కేటాయించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇందుకోసం స్థలాలను సేకరించే ప్రక్రియ జరుగుతోందని, ఆ తర్వాత ఇళ్ల నిర్మాణం మొదలుపెడతామని ఆయన అన్నారు. అపార్ట్‌మెంట్ తరహాలో ఇందిరమ్మ ఇళ్లు ఉంటాయని పేర్కొన్నారు.

త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పనులు

హైదరాబాద్‌లో స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామన్నారు. ఇక మురికివాడల్లో ఉండే ప్రజలు నగర శివారుల్లో నిర్మించే ఇళ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని, దీంతో వారి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే G+5 నుంచి G+10 అంతస్తుల విధానంలో ఇళ్లు నిర్మించి అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. తాజాగా మంత్రి అజారుద్దీన్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తన ఛాంబర్‌లో పొన్నం భేటీ అయ్యారు. నగరంలో డబుల్ బెడ్ రూం ఇల్లు, లబ్దిదారుల ఎంపికపై, ఇతర విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా నగరంలో పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని అన్నారు. ఈ మేరకు ఆధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

ఏప్రిల్ నుంచి షురూ

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూం పథకాల ప్రక్రియను వేగవంతం చేసింది. ఏప్రిల్ నుంచి కొత్త ఇళ్లను మంజూరు చేయనుంది. ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా చాలామంది లబ్ది పొందేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. వీటిని పరిశీలించి లబ్దిదారులను గుర్తించింది. వీరికి దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తోంది. ఇప్పటివరకు కేవలం గ్రామాల్లోని పేదలకు మాత్రమే ఇళ్లను మంజూరు చేయగా.. వీటిల్లో కొన్ని గృహప్రవేశాలు కూడా పూర్తి చేసుకున్నాయి. త్వరలో పట్టణ ప్రాంతాల్లోని పేదలకు కూడా పథకాల ద్వారా ఇళ్లను మంజూరు చేసేందుకు సిద్దమవుతోంది.

Follow Us