AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చర్లపల్లి రైల్వేస్టేషన్ టెర్మినల్ అభివృద్ధిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష.. అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్య తీరుతుందని ఆకాంక్ష..

హైదరాబాద్‌లో చర్లపల్లి పర్యటించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చర్లపల్లి రైల్వేస్టేషన్ టెర్మినల్ అభివృద్ధిపై పనులు పరిశీలించారు. టెర్మినల్ మ్యాప్ ను పరిశీలించారు. అధికారులతో సమీక్ష జరిపారు.

Telangana: చర్లపల్లి రైల్వేస్టేషన్ టెర్మినల్ అభివృద్ధిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష.. అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్య తీరుతుందని ఆకాంక్ష..
Central Minister Kishan Red
Surya Kala
| Edited By: |

Updated on: Sep 11, 2022 | 2:05 PM

Share

Telantgana: హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ పై అధికారులతో సమీక్షించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కేంద్రం చేపట్టబోయే రైల్వే అభివృద్ధి పనుల గురించి వెల్లడించారు కిషన్ రెడ్డి.  చర్లపల్లి రైల్వే స్టేషన్ ఏర్పడితే అన్ని రకాల రవాణా సౌలభ్యం కలుగుతుందని చెప్పారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. చర్లపల్లి రైల్వేస్టేషన్ టెర్మినల్ అభివృద్ధిపై అధికారులతో కలిసి సమీక్ష చేశారు. చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకొస్తే ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుందన్నారు కిషన్ రెడ్డి.

హైదరాబాద్‌లో చర్లపల్లి పర్యటించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చర్లపల్లి రైల్వేస్టేషన్ టెర్మినల్ అభివృద్ధిపై పనులు పరిశీలించారు. టెర్మినల్ మ్యాప్ ను పరిశీలించారు. అధికారులతో సమీక్ష జరిపారు. రూ.300 కోట్లతో చర్లపల్లి రైల్వేస్టేషన్‌ టెర్మినల్‌ నిర్మాణం చేపడతామని.. రూ.20 వేల కోట్లతో రీజనల్‌ రింగ్‌రోడ్డుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్‌, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. రూ.600 కోట్లతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌.. అభివృద్ధి పనులను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు కేంద్రమంత్రి. రైల్వే కనెక్టివిటీకి భూమి కావాల్సి ఉందన్నారు. దీనికోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి మూడు సార్లు లేఖ రాశానని చెప్పారు కిషన్ రెడ్డి. ఘట్‌కేసర్‌-యాదాద్రికి పేదల రవాణా ఎంఎంటీఎస్ రైలు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సెకండ్‌ ఫేజ్‌ ఎంఎంటీఎస్‌ ట్రాక్‌ నిర్మాణానికి.. రాష్ట్ర ప్రభుత్వ వాటా త్వరగా విడుదల చేయాలని కోరారు కిషన్ రెడ్డి. రైల్వే అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బేగంపేట స్టేషన్‌లో దిగిన మహిళ.. సూట్‌కేస్ తెరిచి చూడగా షాక్‌
బేగంపేట స్టేషన్‌లో దిగిన మహిళ.. సూట్‌కేస్ తెరిచి చూడగా షాక్‌
మందు తాగేటప్పుడు ఖచ్చితంగా ఈ పని చేయండి..
మందు తాగేటప్పుడు ఖచ్చితంగా ఈ పని చేయండి..
మీ బంగారం బ్యాంక్ లాకర్‌లో భద్రంగా ఉందా? RBI రూల్స్‌ తెలిస్తే..
మీ బంగారం బ్యాంక్ లాకర్‌లో భద్రంగా ఉందా? RBI రూల్స్‌ తెలిస్తే..
6 బంతులు, 22 పరుగులు.. ఒకే ఓవర్‌లో మ్యాచ్ తిప్పేసిన అభిషేక్ శర్మ
6 బంతులు, 22 పరుగులు.. ఒకే ఓవర్‌లో మ్యాచ్ తిప్పేసిన అభిషేక్ శర్మ
ఇంకో హీరోయిన్ అయితే సగంలోనే చేతులెత్తేసేది..
ఇంకో హీరోయిన్ అయితే సగంలోనే చేతులెత్తేసేది..
ఐఏఎఫ్‌ అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఇంటర్‌ అర్హత
ఐఏఎఫ్‌ అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఇంటర్‌ అర్హత
రాజనాల గురించి ఈ విషయాలు తెలిస్తే మీరు పక్కా ఆశ్చర్యపోవాల్సిందే..
రాజనాల గురించి ఈ విషయాలు తెలిస్తే మీరు పక్కా ఆశ్చర్యపోవాల్సిందే..
కిలో చికెన్‌ పచ్చడి అమ్మితే ఎంత లాభం వస్తుందే తెలుసా?
కిలో చికెన్‌ పచ్చడి అమ్మితే ఎంత లాభం వస్తుందే తెలుసా?
భీష్మ అష్టమి.. ఈరోజు ఉపవాసం ఉంటే తెలివైన సంతానం కలుగుతారు తెలుసా.
భీష్మ అష్టమి.. ఈరోజు ఉపవాసం ఉంటే తెలివైన సంతానం కలుగుతారు తెలుసా.
60బంతుల్లోనే కివీస్ కథ ఖతం..వరల్డ్ రికార్డులు బద్దలుకొట్టిన భారత్
60బంతుల్లోనే కివీస్ కథ ఖతం..వరల్డ్ రికార్డులు బద్దలుకొట్టిన భారత్