Hyderabad: వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం ఢిల్లీలో ఉన్నారు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముసారాంబాగ్ బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Hyderabad: వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం ఢిల్లీలో ఉన్నారు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
Kishan Reddy Hyd Rains
Follow us

|

Updated on: Jul 30, 2022 | 12:52 PM

Hyderabad:  గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు, నదులు, చెరువులు పొంగుతున్నాయి. హైదరాబాద్ లో కుంభవృష్టితో మూసీనది పొంగి పొర్లుతోంది. చాదర్ ఘాట్, ముసారాంబాగ్ బ్రిడ్జిలు వరద ముంపుకు గురయ్యాయి. దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముసారాంబాగ్ బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రుణాలు తీసుకుంది తప్పితే ఇంత వరకు.. బ్రిడ్జి పునర్మిణంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదంటూ తీవ్ర విమర్శలు  చేశారు. గత ఏడాది లక్ష ఇళ్లలో నీళ్లు వస్తే..  ప్రభుత్వం 1000 కోట్లు ఖర్చు పెట్టింది. మూసీ నదీ పరీవాహక ప్రాంత అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.. కానీ ముంపు తప్పే విధంగా సుదీర్ఘప్రణాళికతో పనులు చేపట్టడం లేదని అన్నారు. మరోవైపు కొంత మంది మూసీ నది ఆక్రమించుకున్నారు.. గతంలోనే ఈ అక్రమ ఆక్రమణలను నిరోదించమని తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కోరినట్లు గుర్తుచేశారు.

మూసీని సబర్మతి నదిలా తయారు చేస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పింది.. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే సీఎం ఢిల్లీలో ఉన్నారు. ఆసలు ఢిల్లీకి నాలుగు రోజులపాటు వెళ్లిన ముఖ్యమంత్రి ఎం చేసారో ఎవరికి అర్థం కావట్లేదన్నారు కిషన్ రెడ్డి. sdrf నిధులను ప్రభుత్వం ఖర్చు చేయలేదని ఆడిట్ లో తేలిందన్నారు. ఇందులో కేంద్రం వాటా కూడా చాలా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవట్లేదన్నారు. అంతేకాదు ఇంకా మీకు పరిపాలనకు కొన్ని రోజులు మాత్రమే అవకాశం ఉంది. ఉన్నన్ని రోజులైనా మంచి పనులు చేయాలని సూచించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ రాష్ట్రంలో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ తన పూర్తి సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలోని నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించిన అభివృద్ధిలో సాధించిన పురోగతి చాలా స్వల్పమనే చెప్పవచ్చు. ఆయా విమానాశ్రయాలలో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను కల్పించామంటూ కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి ఓ బహిరంగ లేఖ రాశారు.   .

1. వరంగల్ విమానాశ్రయం: 748 ఎకరాలలో విస్తరించి ఉన్న వరంగల్ విమానాశ్రయం ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కు సంబంధించినది. ఇది ప్రస్తుతం శితిలావస్థలో ఉంది. అక్కడ ఎటువంటి కార్యకలాపాలను సాగించడానికి వీలు లేకుండా ఉంది. ఈ విమానాశ్రయంలో ప్రైవేట్ విమానాలు రాకపోకలు సాగించటానికి వీలుగా విమానాశ్రయంలో ఉన్న అడ్డంకులను తొలగించి కావలసిన మరమ్మత్తులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేస్తున్నానని చెప్పారు. ఈ విమానాశ్రయం మొదటి దశ అభివృద్ధి పనులకు 27.7 ఎకరాలు, రెండవ దశ అభివృద్ధి పనులకు 333.86 ఎకరాల భూమిని సమీకరించవలసి ఉంటుందని చెప్పారు.

2. అదిలాబాద్ విమానాశ్రయం: వాణిజ్య విమానాలు రాకపోకలు సాగించటానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం క్రింది చర్యలను తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. రన్ వే కు సంబంధించిన అప్రోచ్ ఫన్నెల్ నందు, ఆ మార్గంలో ఉన్న 100 కు పైగా అడ్డంకులను తొలగించాలని సూచించారు. అనుకుంట గ్రామాన్ని, అదిలాబాద్ తో కలిపే రోడ్డును దారి మళ్లించాలి. మొదటి దశ అభివృద్ధి పనులకు 122 ఎకరాలు, రెండవ దశ అభివృద్ధి పనులకు 175 ఎకరాల భూమిని సమీకరించవలసి ఉంటుందని గుర్తు చేశారు.

3. జక్రాన్ పల్లి విమానాశ్రయం: ఇది గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం. వాణిజ్య విమానాలు రాకపోకలు సాగించటానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం క్రింది చర్యలను తీసుకోవలసి ఉంటుంది. ఇది గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కావడం వలన మొదట విమానయాన మంత్రిత్వ శాఖ నుండి అనుమతులు తీసుకోవలసి ఉంటుంది. విమానాశ్రయం నిర్మించే స్థలంలోని అడ్డంకులను తొలగించి, భారత వాయుసేన(IAF) నుండి అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఈ విమానాశ్రయం మొదటి దశ అభివృద్ధిపనులకు ఇది వరకే చూపించిన స్థలంలో 510 ఎకరాలు, రెండవ దశ అభివృద్ధి పనులకు 235 ఎకరాలను సమీకరించవలసి ఉంటుందన్నా కేంద్ర మంత్రి.

సాంకేతిక పరంగా, ఆర్థిక పరంగా పై మూడు విమానాశ్రయాలకు సంబంధించిన సాధ్యాసాధ్యాల నివేదికలను కూడా ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) 17 జూన్, 2021న  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పై మూడు విమానాశ్రయాలను ఏర్పాటు చేయటంలో అవసరమైన సహకారాన్ని అందించటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది కనుక.. ఈ అవకాశాన్ని వినియోగలించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికే అంటూ  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..