Hyderabad: పీకల్లోతు వివాదంలో మరో పోలీస్‌ అధికారి.. కార్ల కన్సల్టెన్సీ ఉందంటూ భారీగా వసూళ్లు

Hyderabad Police: హైదరాబాద్ పోలీస్ శాఖలో మరో ఘటన కలకలం రేపుతోంది. ఇప్పటికే సీఐ నాగేశ్వరరావు లైంగిక వేధింపుల ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురి కాగా, ఇప్పుడు మరో పోలీస్‌ అధికారి జనం దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసిన

Hyderabad: పీకల్లోతు వివాదంలో మరో పోలీస్‌ అధికారి.. కార్ల కన్సల్టెన్సీ ఉందంటూ భారీగా వసూళ్లు
Southzone Dcp Cc
Follow us

|

Updated on: Jul 30, 2022 | 1:21 PM

Hyderabad Police: హైదరాబాద్ పోలీస్ శాఖలో మరో ఘటన కలకలం రేపుతోంది. ఇప్పటికే సీఐ నాగేశ్వరరావు లైంగిక వేధింపుల ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురి కాగా, ఇప్పుడు మరో పోలీస్‌ అధికారి జనం దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సౌత్ జోన్ డీసీపీ దగ్గర సీసీగా పనిచేస్తున్న గోపీకృష్ణ అనే పోలీస్‌ అధికారి అరాచకాలకు అడ్డాగా మారాడని అతని చేతిలో మోసపోయిన బాధితులు వాపోతున్నారు. తనను గోపీకృష్ణ బెదిరిస్తున్నాడని మహ్మద్‌ యాసిన్ అనే బాధితుడు హైదరాబాద్ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గోపికృష్ణ సౌత్‌జోన్‌ డీసీపీ కార్యాలయాన్ని కంట్రోల్ చేస్తూ తన ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తన బావమరిది శశాంక్ అనే వ్యక్తికి కార్ల డీలర్ షిప్ ఉందని నమ్మించి, తక్కువ ధరకు కార్లు ఇప్పిస్తానని చెప్పి అనేక మంది దగ్గర గోపి డబ్బులు తీసుకున్నాడంటున్నారు. అయితే సంవత్సరాలు గడుస్తున్నా వాహనాలు ఇప్పించకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దీనిపై ఎవరూ పట్టించుకోవడం లేదని, కేసు కూడా నమోదు చేయడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

కార్ల డీలర్‌షిప్‌ పేరుతో..

మహ్మద్ యాసిన్ 3 లక్ష రూపాయలు తీసుకున్నాడు శశాంక్‌. కార్ ఇప్పిస్తానని డబ్బులు కూడా తీసుకున్నాడు. అయితే గత రెండు సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని, తన బామ్మర్దికి డీలర్ షిప్ ఉందని చెప్పిన గోపీకృష్ణ సైతం సైలెంట్ అయిపోయాడని చెబుతున్నాడు యాసిన్‌. ఇదే విషయంపై సౌత్‌ జోన్‌ డీసీపీకి, గోల్కొండ పోలీసులకి ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితుడు చెబుతున్నాడు. సౌత్‌జోన్‌ డీసీపీతో పనిచేసిన చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు తనకు తెలుసునని మీరు ఎక్కడికి వెళ్లినా ఏమీ చేయలేరని బాధితులను బెదిరిస్తున్నాడట గోపికృష్ణ.

ఇవి కూడా చదవండి

ఆధారాలుగా వాట్సప్‌ స్ర్కీన్‌షాట్స్‌

కాగా బాధితుడు గోల్కొండ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అక్కడి ఎస్ఐకి సైతం ఫోన్ చేసి సౌత్‌జోన్‌ డీసీపీ సౌజన్‌ బెదిరింపులకు పాల్పడ్డాడని యాసిన్‌ చెబుతున్నాడు. తనతో పాటు ఇంకా అనేక మందిని కార్ల డీలర్ షిప్ పేరుతో సీసీ మోసం చేశాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈక్రమంలో తన బామ్మర్ది శశాంక్‌కు తాను డీలర్ షిప్ ఇప్పించిన మాట వాస్తవమే కానీ డబ్బులు వ్యవహారంలో తానెంత చెప్పినా వినట్లేదని గోపికృష్ణ మెసేజ్ చేసినట్టు యాసిన్‌ వాట్సాప్ స్క్రీన్ షాట్లు బయటపెట్టాడు. తన దగ్గర ఉన్న ఆధారాలను కూడా హైదరాబాద్ పోలీసులకు ఇచ్చానని ఫిర్యాదులో తెలిపాడు. హైదరాబాద్ పోలీసులకి, గోల్కొండ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసినా కూడా కేసు నమోదు చేయకుండా అడ్డుకున్నాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..