AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: విద్యార్థిని హరిత ఆత్మహత్యకు వారి వేధింపులే కారణం.. దర్యాప్తులో పోలీసుల ప్రాథమిక నిర్థారణ

NTR District News: ఎన్టీఆర్‌ జిల్లాలో విద్యార్థిని హరిత ఆత్మహత్య కేసుపై పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. హరిత ఆత్మహత్యకు బ్యాంకు రికవరీ ఏజెంట్ల వేధింపులే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Andhra Pradesh: విద్యార్థిని హరిత ఆత్మహత్యకు వారి వేధింపులే కారణం.. దర్యాప్తులో పోలీసుల ప్రాథమిక నిర్థారణ
Student Harita
Janardhan Veluru
|

Updated on: Jul 30, 2022 | 1:16 PM

Share

Student Haritha: ఎన్టీఆర్‌ జిల్లాలో విద్యార్థిని హరిత ఆత్మహత్య కేసుపై పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. హరిత ఆత్మహత్యకు బ్యాంకు రికవరీ ఏజెంట్ల వేధింపులే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. నలుగురు ఏజెంట్లు హరిత ఇంటికెళ్లినట్టు అందులో తేలింది. వాళ్లు SLV ఫైనాన్షియల్‌ సర్వీస్‌కు చెందిన ఏజెంట్లుగా గుర్తించారు. హరిత తండ్రిని కించపరుస్తూ భాగ్యతేజ, పవన్ కామెంట్స్‌ చేశారు. ఒకేరోజు రెండుసార్లు ఫోన్‌చేసి ఏజెంట్లు వేధించారు. పరువు పోయిందనే మనస్తాపంతో హరిత ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబాన్ని వేధించిన రికవరీ ఏజెంట్లను పట్టుకునేందుకు  2 ప్రత్యేక బృందాలు వేటాడుతున్నాయి.

విద్యార్థిని హరిత సూసైడ్ కేసును దర్యాప్తులో భాగంగా నందిగామలోని హరిత అద్దె ఇంటికి  పోలీసు క్లూస్ టీం శనివారం ఉదయం చేరుకుంది. హరిత ఆత్మహత్య చేసుకున్న ప్రదేశాన్ని క్లూస్ టీం పరిశీలించింది. హరిత ఆత్మహత్య చేసుకున్న చోట కొలతను తీసుకున్నారు.  ఇంటి వద్ద ఆధారాలు సేకరించారు. హరిత నోట్ బుక్స్ ,ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. హరిత రాసిన సూసైడ్ నోట్ బుక్, పెన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..